Debendra Nath Ray Death: ఎమ్మెల్యే మృతితో రావణకాష్టంలా మారిన బెంగాల్, 12 గంటల బంద్‌కి పిలుపునిచ్చిన బీజేపీ పార్టీ, బస్సులను ధ్వంసం చేసిన నిరసనకారులు

పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే మృతితో పశ్చిమ బెంగాల్ రగలిపోతోంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆయన మృతితో (Debendra Nath Ray Death) 12 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ కార్యకర్తలు (BJP Activists) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. కుచ్‌బెహర్ ప్రాంతంలో బస్సులు ధ్వంసం చేశారు. రోడ్లు దిగ్బంధించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి (Mamata Banerjee Govt) వ్యతిరేకంగా ఈ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

West Bengal Police (Photo Credits: ANI)

Kolkata, July 14: పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే మృతితో పశ్చిమ బెంగాల్ రగలిపోతోంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆయన మృతితో (Debendra Nath Ray Death) 12 గంటలపాటు బంద్‌కు పిలుపునిచ్చిన బీజేపీ కార్యకర్తలు (BJP Activists) రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. కుచ్‌బెహర్ ప్రాంతంలో బస్సులు ధ్వంసం చేశారు. రోడ్లు దిగ్బంధించారు. మమత బెనర్జీ ప్రభుత్వానికి (Mamata Banerjee Govt) వ్యతిరేకంగా ఈ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే మృతి హత్యా? ఆత్మహత్యా?, సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు, తన మృతికి ఇద్దరు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోట్ రాసిన దేబేంద్ర నాథ్

బంద్ నేపథ్యంలో మార్కెట్లు మూతపడ్డాయి. బీజేపీ కార్యకర్తల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొడుతున్నారు. కూచ్‌బెహార్ ప్రాంతంలో నిరసనకారులు బస్సులను ధ్వంసం చేస్తున్న సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురిపై కేసులు పెట్టే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు కాగా, ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ తన గ్రామ సమీపంలోని బిందాల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. అయితే, అది ఆత్మహత్య కాదని, హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఉరి వేసుకుని చనిపోయిన బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్, సొంతూరుకు కిలోమీట‌ర్ దూరంలో బిందాల్ వ‌ద్ద ఎమ్మెల్యే మృత‌దేహం, హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణలు..

పశ్చిమబెంగాల్ లో దేవేంద్రనాథ్ రాయ్ అనే బీజేపీ ఎమ్మెల్యే మృతదేహాన్ని ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలోని ఓ మార్కెట్ లో కనుగొన్నారు. అక్కడి ఓ షాపు వరండాలో ఆయన డెడ్ బాడీ ఓ తాడుకు వేలాడుతూ కనిపించినట్టు పోలీసులు తెలిపారు. ఈ మార్కెట్ ఈ ఎమ్మెల్యే ఇంటికి కిలోమీటర్ దూరంలోనే ఉంది.

BJP Calls For 12 hour Bandh in North Bengal to Protest Over the death of MLA Debendra Nath Ray:

కొందరు వ్యక్తులు సోమవారం తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో తమ ఇంటికి వచ్చి.. దేవేంద్రనాథ్ ని తమతో తీసుకువెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపై సీబీఐ దర్యాప్తు జరపాలని వారు కోరారు. దేవేంద్రనాథ్ రాయ్ ని హత్య చేశారని బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ ఆరోపించారు. రాష్ట్రంలో తమ పార్టీ నేతల హత్యల పరంపర కొనసాగుతూనే ఉందని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నవారిని హతమారుస్తున్నారని ఆయన అన్నారు.

దేవేంద్రనాథ్.. 2016 లో సీపీఎం టికెట్ పై హేమతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతునిచ్చింది. అయితే గత ఏడాది లోక్ సభ ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరారు.

 

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now