The BJP Symbol (Representational Image/ Photo Credits: ANI)

Kolkata, July 13: కరోనావైరస్ విస్తరిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ (West Bengal BJP) పార్టీకి చిన్న షాక్ లాంటి వార్త ఇది. ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్ (BJP MLA Debendra Nath Ray) ఉరేసుకున్నారు. త‌న సొంతూరుకు కిలోమీట‌ర్ దూరంలో ఉన్న బిందాల్ వ‌ద్ద ఎమ్మెల్యే మృత‌దేహం (Body Found Hanging) క‌నిపించింది. ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ హెమ్తాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బెంగాల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.  భారీగా కోలుకున్న కరోనా బాధితులు, దేశంలో ఇప్పుడు కోవిడ్-19 యాక్టివ్ కేసులు 3,01,609 మాత్రమే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు 8,78,254

అయితే ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ మృతిపై (Debendra Nath Ray Death) కుటుంబ స‌భ్యులు, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఆత్మ‌హ‌త్య కాదు.. ఇది రాజ‌కీయ హ‌త్యే అని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. హ‌త్య చేసి ఉరేశార‌ని పేర్కొన్నారు.కాగా నిన్న రాత్రి కొంద‌రు వ‌చ్చి ఎమ్మెల్యేను బైక్ పై ఎక్కించుకు పోయార‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. తెల్లారేస‌రికి బిందాల్ ఏరియాలో మూసివేసిన దుకాణం వ‌రండాలో ఎమ్మెల్యే వేలాడుతుండ‌టాన్ని స్థానికులు గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Debendra Nath Ray Found Hanging: 

ఇదిలా ఉంటే దేబేంద్ర నాథ్ సీపీఐ-ఎం పార్టీని వీడి 2019, మే నెల‌లో బీజేపీలో చేరారు. ఆయ‌న‌తో పాటు 50 మంది కౌన్సిల‌ర్లు.. బీజేపీ సీనియ‌ర్లు ముకుల్ రాయ్, కైలాష్ విజ‌య‌వ‌ర్గీయ స‌మ‌క్షంలో క‌మ‌లం పార్టీలో చేరారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.