Coronavirus Outbreak (Photo Credits: IANS)

New Delhi, July 13: దేశంలో గత వారం రోజులుగా 25 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు (India Coronavirus) నమోవదవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో గత 24 గంటల్లో కొత్తగా 28,701 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,78,254కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,01,609 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 5,53,471 మంది బాధితులు కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 500 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య (Coronavirus Deaths) 23,174కు పెరిగింది. చైనాపై మండిపడిన క‌జికిస్థాన్‌, అంతుచిక్కని వ్యాధి క‌జికిస్థాన్‌ని వణికిస్తుందని చైనా చేసిన ప్రకటన అంతా పుకారని కొట్టి పారేసిన క‌జ‌కిస్థాన్ ప్ర‌భుత్వం

గత 24 గంటల్లో 18850 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (Ministry of Health and Family Welfare) ప్రకటించింది. జూలై 12 వరకు 1,18,06,256 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకటించింది. నిన్న ఒకేరోజు 2,19,103 నమూనాలు పరీక్షించామని తెలిపింది.

10 లక్షల మంది జనాభాతో ఆసియా లో అతి పెద్ద మురికివాడ ధారావిలో ( Coronavirus in Dharavi) ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఏప్రిల్‌ 1న అక్కడ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగానే అందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అయితే బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ధారావిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది. కరోనాపై చేసిన కృషికిగానూ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. డబ్ల్యూహెచ్‌ఓ ధారావిలో కరోనా కట్టడి చర్యల్ని కొనియాడింది. ధారావిలో కరోనా కేసులు రోజుకి రెండు లేదంటే మూడు మాత్రమే నమోదవుతున్నాయి. ఒక్కడు 119 మందికి కరోనాని అంటించాడు

ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్‌–19 కేసుల సంఖ్య 35 వేలు దాటిపోవడంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే శని, ఆదివారాల నుంచి అమలయ్యే ఈ నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని రాష్ట్ర అదనపు చీఫ్‌ సెక్రటరీ(హోం, సమాచార) అవనీశ్‌ అవస్థి పేర్కొన్నారు. ముఖ్యంగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనసమ్మర్థం ఉండే మార్కెట్లు, కార్యాలయాలను ఈ రెండు రోజుల్లో మూసివేసి ఉంచుతామన్నారు. బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. దీంతోపాటు, ప్రభుత్వం ప్రకటించిన విధంగా శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు 55 గంటలపాటు ఆంక్షలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. పెట్టుబడులకు తలుపులు తెరిచాం, భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటోంది, ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇండియా గ్లోబల్ వీక్-2020లో పిలుపునిచ్చిన ప్రధాని మోదీ

మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో 18 మంది సిబ్బందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన వారిలో గవర్నర్‌తో సన్నిహితంగా మెలిగిన సిబ్బంది కూడా ఉన్నారు. బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని నానావతి ఆస్పత్రికి తరలించిన అనంతరం గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కోవిడ్‌-19 కేసులు ఏకంగా 2,50,000కు చేరువవడతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. కరోనా కట్టడికి పుణే జిల్లాలో జులై 13 నుంచి పదిరోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. థానే జిల్లాలో కూడా లాక్‌డౌన్‌ను ఈనెల 19 వరకూ పొడిగించారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 90 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో నమోదైనవే. ఇక 49 జిల్లాల్లోనే 80 శాతం కరోనా వైరస్‌ కేసులున్నాయని కోవిడ్‌-19పై ఏర్పాటైన మంత్రుల బృందం పేర్కొంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు రాష్ట్రాలు మినీలాక్‌డౌన్‌ విధించాయి. కర్ణాటక, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయల్లో లాక్‌డౌన్‌ విధించారు. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్‌ ప్రాంతాల్లో జూలై 14 రాత్రి 8 గంటల నుంచి జూలై 22 ఉదయం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కర్ణాటక సీఎం తెలిపారు. అస్సాం రాష్ట్రం గౌహతిలోని కామ్‌రూప్‌లో జూలై 12 నుంచి మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్, నహర్‌లాగన్, నిర్జులి, బందర్‌దేవాల్లో గతంలో విధించిన లాక్‌డౌన్‌ జూలై 13 సాయంత్రానికి ముగియనుండడంతో దీన్ని మరోవారం పొడిగించారు.