West Bengal Police (Photo Credits: PTI)

Kolkata, July 13: పశ్చిమ బెంగాల్‌ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రే అనుమానాస్పదంగా మృతి (Debendra Nath Ray Death) చెందిన ఘటనలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మృతదేహం దగ్గర సూసైడ్‌ నోట్‌ (Suicide Note) లభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నోట్ లో తన మృతికి ఇద్దరు వ్యక్తులు కారణమని, ఆ ఇద్దరు వ్యక్తులు తన మృతికి బాధ్యత వహించాలని (Two People Mentioned in It) ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్‌ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఉరి వేసుకుని చనిపోయిన బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రాయ్, సొంతూరుకు కిలోమీట‌ర్ దూరంలో బిందాల్ వ‌ద్ద ఎమ్మెల్యే మృత‌దేహం, హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణలు..

ఈ రోజు ఉదయం ఉత్తర దినాజ్‌పూర్‌లోని బిందాల్ గ్రామం సమీపంలో ఉన్న మార్కెట్‌లో ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ ఉరివేసుకుని మృతి చెందిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఒంటి గంటకు ఎమ్మెల్యేను కొంత మంది వ్యక్తులు పిలిచారని, అతనిది ఆత్మ హత్య కాదని ఎవరో కావాలని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే మృతి హత్యా? ఆత్మహత్య? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతుతున్నాయి. ఆయన మృతిపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు.

Take a Look at the tweets:

ఎమ్మెల్యే మృతి కేసును సీబీఐకి అప్పంగించాలని బీజేపీ నేత రాహుల్‌ సిన్హా డిమాండ్‌ చేశారు. దేబేంద్ర నాథ్‌ మృతి వెనక తృణమూల్‌ కాంగ్రెస్‌ హస్తం ఉందని తీవ్రంగా ఆరోపించారు. మృతికి సంబంధించిన నిజాలు బయటకు రావడానికి సీబీఐ దర్యాప్తుకు అనుమతించాలని సీఎం మమతా బెనర్జీని కోరుతున్నట్లు తెలిపారు.