Delhi Fire: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, మురికివాడలొ కాలి బూడిదైన 1200 ఇళ్లు, అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు
దక్షిణ తూర్పు ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలోని మురికివాడలోని గుడిసెలకు సోమవారం అర్దరాత్రి మంటలంటుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి 12.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రెండు ఎకరాల వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 12వందల ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
Delhi, May 26: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని తుగ్లకాబాద్ లోని కేశవపురం ఏరియాలో (Keshavpuram Area) సోమవారం అర్దరాత్రి ఘోర అగ్నిప్రమాదం (Delhi Fire) జరిగింది. దక్షిణ తూర్పు ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలోని మురికివాడలోని గుడిసెలకు సోమవారం అర్దరాత్రి మంటలంటుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి 12.50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు రెండు ఎకరాల వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 12వందల ఇండ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో లక్షా 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి (Fire Engines Rush to Spot) తీసుకువచ్చారు. సోమవారం రాత్రి ఒంటిగంటకు అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిందని డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా చెప్పారు. ప్రమాదం సుమారు 1000 - 1200 ఇళ్లు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు. అర్థరాత్రి సమయంలో ప్రమాదం సంభవించినప్పటికి ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు.
Here's ANI Tweet
అగ్నిప్రమాదం జరగగానే గుడిసెల్లోనుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. 30 అగ్నిమాపక వాహనాలు వచ్చి తుగ్లకాబాద్ మురికివాడలో మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. గుడిసెవాసులను పునరావాస శిబిరానికి తరలించారు.
వారాంతంలో ఇలాంటి సంఘటన రెండోది, దక్షిణ ఢిల్లీలోని సిగ్నస్ ఆసుపత్రిలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇది COVID-19 కోసం నియమించబడిన ఆసుపత్రి. ఎనిమిది ఫైర్ టెండర్లను అక్కడికి తరలించారు. వారు మంటలను అదుపులో ఉంచారు. ఈ సంవత్సరం ప్రారంభంలో,ఢిల్లీలోని లారెన్స్ రోడ్ ప్రాంతంలో షూ తయారీ విభాగంలో మంటలు చెలరేగాయి. మంటలను అరికట్టడానికి 26 ఫైర్ టెండర్లు అక్కడికి చేరుకున్నాయి.