Coronavirus in India: మాస్కోని ముంబై దాటేస్తోందా?, దేశంలో కోవిడ్ 19 ప్రధాన హాట్ స్పాట్ కేంద్రంగా ముంబై, భారత్‌లో 1,45,380 కేసులు నమోదు, 4,167 మంది మృతి
Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi, May 26: భారత్‌లో కరోనావైరస్‌ (Coronavirus in India) విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,535 కరోనా కేసులు నమోదు కాగా, 146 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,380కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 60,490 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,167 మంది (Coronavirus deaths in india) మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 80,722 కరోనా యాక్టివ్‌ కేసులు (2020 Coronavirus Pandemic in India) ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, ఇప్పటివరకు 214 కేసులు నమోదు, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ లాక్‌డౌన్ అమలు

రోజు రొజుకు పెరుగుతున్న కేసులతో టాప్‌-10 దేశాల్లోకి భారత్‌ కూడా చేరింది. వారం రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడంతో వైరస్‌ బారిన పడిన 10 దేశాల జాబితాలో భారత్‌ చేరింది. గత సోమవారం 5,242 కేసులు నమోదైతే, బుధవారం 5611, శుక్రవారం 6088, శనివారం 6,654, ఆదివారం 6,767, సోమవారం 6535 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కేసుల పరంగా అమెరికా మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో బ్రెజిల్‌ నిలిచింది. చైనా ప్రస్తుతం 14వ స్థానానికి పడిపోయింది. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా గూఢాచారి పావురం, పాకిస్థాన్‌ గూఢచార కపోతంగా నిర్థారించిన కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా, ఆర్మీ అధికారులకు అప్పగింత

దేశ‌వ్యాప్తంగా న‌మోద‌వుతున్న కేసుల్లో మ‌హారాష్ట్ర‌లోనే స‌గానికిపైగా ఉన్నాయి. ఒక్క ముంబై (Mumbai) మ‌హా న‌గ‌రంలో సుమారు 0.22 శాతం జ‌నాభా వైర‌స్‌ బారిన ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పుడీ వాణిజ్య న‌గ‌రం ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో ప్ర‌ధాన‌ హాట్ స్పాట్ కేంద్రంగా ప్ర‌పంచ ప‌టంలోకి ఎక్క‌నుంది. ప్ర‌స్తుతానికైతే ఆ స్థానం ర‌ష్యా రాజ‌ధాని మాస్కో పేరు మీద ఉంది. కానీ అక్క‌డ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌గా ముంబైలో మాత్రం అందుకు విరుద్ధంగా బాధితుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మే 22న ఒక్క‌రోజే ముంబైలో 1751 కేసులు వెలుగు చూశాయి. మాస్కో(ర‌ష్యా) మిన‌హా మ‌రే ఇత‌ర న‌గ‌రాల్లోనూ ఒకేరోజు ఇంత మొత్తంలో కేసులు న‌మోద‌వ‌లేదు. ప్ర‌తిరోజు ఎక్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతుండ‌టంతో త్వ‌ర‌లోనే ముంబై ప్ర‌పంచంలోనే అత్య‌ధిక క‌రోనా కేసులున్న న‌గ‌రాల్లో రెండో స్థానం నుంచి మొద‌టి స్థానానికి ఎగ‌బాకేటట్లు క‌నిపిస్తోంది.  తల్లిని చూడాలనే ఆరాటం, విమానంలో 5 ఏళ్ల బాలుడి ఒంటరి ప్రయాణం, మూడు నెలల తర్వాత తల్లి చెంతకు చేరిన విహాన్ శర్మ

ఏప్రిల్‌, మే నెలలతో పోలిస్తే వచ్చే నెలలో పరిస్థితులు దారుణంగా ఉంటాయని అంచనా వేస్తున్నామని, జూలైలో కేసులు తారస్థాయికి పెరుగుతాయని బీహార్‌లో కేర్‌ ఇండియా బృంద సారధి-అంటువ్యాధుల నిపుణులు తన్మయ్‌ మహాపాత్ర పేర్కొన్నారు. ఇప్పటికే రెండు నెలలు లాక్‌డౌన్‌లో ఉన్న దేశాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మరెంతో కాలం లాక్‌డౌన్‌లో ఉంచలేమన్నారు. అలాగని ప్రతి ఒక్కరు ఇష్టారాజ్యంగా ఎక్కడికైనా వెళ్లొచ్చని కాదని చెప్పారు.

ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో ఇప్పటివరకూ ఒక్క కొవిడ్‌-19 కేసు నమోదుకాకపోవడం విశేషం. దేశంలో వైరస్‌ కేసులు వెలుగుచూస్తున్నాయన్న వార్తలు రాగానే అప్రమత్తమైన నాగాలాండ్‌ సర్కార్‌ అసోం వంటి సరిహద్దు రాష్ర్టాలతో రాకపోకల్ని నిషేధించింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రాష్ర్టానికి చెందిన వలస కార్మికులు స్వరాష్ర్టానికి రాకుండా ఉంటే ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున ఇస్తామని తాయిలాన్ని ప్రకటించింది. అయితే, కరోనా పరీక్షల్ని నిర్వహించే కొవిడ్‌-19 టెస్టింగ్‌ ల్యాబ్‌ గతవారమే రాష్ట్రంలో ఏర్పాటు అయిందని, అందుకే రాష్ట్రంలో కేసులు నమోదు కాలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు, లక్షద్వీప్‌, మిజోరామ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ప్రస్తుతం ఎలాంటి వైరస్‌ యాక్టివ్‌ కేసులు లేవని అధికారులు తెలిపారు.