Lockdown 5.0 in Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో జూన్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, ఇప్పటివరకు 214 కేసులు నమోదు, రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ లాక్‌డౌన్ అమలు
Curfew ANI | Representational Image)

Shimla, May 26: కొన్ని సడలింపులతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ 4.0 (Lockdown 4) కొనసాగుతోంది. అయితే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్పుడే లాక్‌డౌన్ 5.0 (Lockdown 5.0 in Himachal Pradesh) ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్‌ (Lockdown ) పొడిగిస్తున్నట్టు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం (Himachal Pradesh Govt) ప్రకటించింది. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా గూఢాచారి పావురం, పాకిస్థాన్‌ గూఢచార కపోతంగా నిర్థారించిన కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా, ఆర్మీ అధికారులకు అప్పగింత

లాక్‌డౌన్‌ను మరో ఐదు వారాలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకొన్నట్టు ముఖ్యమంత్రి జైరాం ఠాకూక్‌ చెప్పారు. అన్ని జిల్లాల్లో వచ్చే నెల 30 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని వెల్లడించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటివరకు 214 కేసులు నమోదవగా.. 63 మంది డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు చనిపోయారు.

గత నెలరోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హిమాచల్‌ప్రదేశ్‌కు పది వేల మంది వచ్చారు. హమీర్‌పూర్ (63)‌, సోలన్‌ (21) జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండటంతో అక్కడ మరిన్ని కఠిన చర్యలు తీసుకొంటున్నారు. సిమ్లాలో కూడా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోనూ ఈ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. తల్లిని చూడాలనే ఆరాటం, విమానంలో 5 ఏళ్ల బాలుడి ఒంటరి ప్రయాణం, మూడు నెలల తర్వాత తల్లి చెంతకు చేరిన విహాన్ శర్మ

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడం, కేంద్ర ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసులు ప్రారంభించిన క్రమంలో హిమాచల్‌ప్రదేశ్‌ లాక్‌డౌన్‌ను పొడిగించడం గమనార్హం. ఇదిలా ఉంటే అత్యధిక కేసులతో తల్లిడిల్లుతున్న మహారాష్ట్ర మాత్రమే ఇప్పటివరకూ లాక్‌డౌన్‌ పొడిగింపును కోరుతోంది. మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన తర్వాత మూడుసార్లు లాక్‌డౌన్‌ను పొడిగించారు.