Jammu, May 25: సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక గూఢచార పావురాన్ని (Suspected spy pigeon) కథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రకరకాల రంగుల్లో కనిపిస్తున్న ఈ పావురాయిని జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా వాసులు బంధించి పోలీసులకు అప్పగించారు. పాక్ వైపు నుంచి ఆ ప్రాంతంలోకి రావడం గమనించిన వారు.. దీన్ని పాక్ కొత్త ఎత్తుగడగా (Pakistani 'Spy' Pigeon) భావిస్తున్నారు. పావురాయి కాళ్లకి ఓ రింగ్ తొడిగి ఉందన్న విషయాన్ని కూడా వారు పోలీసుల దృష్టికి తెచ్చారు. మిడతల దాడిపై అధికారులు అలర్ట్, వాటిని చంపేందుకు రంగం సిద్ధం, ఇవి పొలంపై వాలాయంటే అంతే సంగతులు
ఆ రింగ్‌పై ఉన్న గుర్తులను బట్టి భారత్‌కు సంబంధించిన వివరాలను గుట్టుచప్పుడు కాకుండా పాక్‌కు చేర్చేందుకే ఈ పావురాయికి శిక్షణ ఇచ్చి ఉంటారని స్థానికలు భావిస్తున్నారు. అయితే సరిహద్దు గుండా భారత్‌లోకి తీవ్రవాదులను పంపిద్దామని పాక్ విశ్వప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసులు దీనిపై ఎటువంటి అధికారికి ప్రకటన చేయనప్పటికీ అసలు ఈ పావురాయి కథ ఏమిటో తేల్చేందుకు వారు రంగంలోకి దిగారు.
Here's ANI Tweet
Jammu&Kashmir: Locals in Kathua captured a pigeon near Indian border fences today. Shailendra Mishra, SSP Kathua says, "We don't know from where it came. Locals captured it near our fences. We have found a ring in its foot on which some numbers are written.Investigation underway" pic.twitter.com/76RJilZTFO
— ANI (@ANI) May 25, 2020
వివరాల్లోకి వెళ్తే.. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులకు హిరానగర్ సెక్టార్ వద్ద ఒక పావురం కిందపడిపోయి కనిపించింది. వారు ఆ పావురాన్ని తీసుకెళ్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఆ పావురం పాకిస్థాన్ బోర్డర్ వైపు ఎగురుతూ కింద పడిపోయిందని మన్యారి గ్రామస్తులు తెలిపారు.
ఆ పావురాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దాని కాలుకు ఒక చిన్న రింగు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆ రింగుపై ప్రత్యేక కోడింగ్‌తో కూడిన సంఖ్యలు ఉండటంతో అది పాకిస్థాన్ గూఢచార కపోతంగా కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా (Shailendra Mishra) నిర్ధారించారు. అనంతరం ఆ పావురాన్నిసంబంధిత ఆర్మీ అధికారులకు అప్పగించారు.