Delhi Fire At Narela industrial Area: ఢిల్లీని వెంటాడుతున్న అగ్ని ప్రమాదాలు, షూ ఫ్యాక్టరీలో మరో భారీ అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు, అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఇప్పటికే రెండు ప్రమాదాలు ఢిల్లీ ప్రజలకు ఉక్కిరిబిక్కిర చేశాయి. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా నెల వ్యవధిలో అక్కడ మూడో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో (Delhi's Narela industrial area) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
New Delhi, December 24: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రమాదాలు ఢిల్లీ ప్రజలకు ఉక్కిరిబిక్కిర చేశాయి. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా నెల వ్యవధిలో అక్కడ మూడో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం (డిసెంబర్ 24)నరేలా ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో (Delhi's Narela industrial area) భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ విషాద ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఫ్యాక్టరీలో సిలిండర్ పేలడంతో (cylinder blast) ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు అంటుకున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని 22 ఫైరింజన్లతో మంటల అదుపుచేసుందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడినవారిని సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Here's the tweet:
కాగా కిరారి ప్రాంతంలోని ఓ బట్టల గోదాంలో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డిన విషయం తెలిసిందే. గాయపడినవారిని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వరుస అగ్నిప్రమాదాలు జరుగుతుండంతో ఢిల్లీలోని ఆయా ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శీతాకాలంలోనే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక వేసవి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 8న ఢిల్లీలోని అనాజ్‌మండిలో గల ఒక ప్లాస్టిక్ సంచుల కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.