Delhi Shocker: ఢిల్లీ ఓయో రూంలో దారుణం, ఆ పనిలో గొడవ రావడంతో ప్రియురాలిని తుఫాకీతో కాల్చి చంపిన ప్రియుడు, ఆ తరువాత అతను కాల్చుకుని ఆత్మహత్యాప్రయత్నం

ఓ వివాహితుడు తన ప్రేయసితో ఏకాంతంగా గడిపేందుకు ఓయో హోటల్‌ రూమ్‌ తీసుకున్నాడు. అయితే ఏమయిందో ఏమో తరువాత గొడవకు దిగి ఆమెను దారుణంగా తుఫాకీతో కాల్చి (Married man shoots girlfriend) చంపేశాడు.

Pak Ex- Minister Son Sentenced to Death, Image used for representation purpose only | Photo: PTI

New Delhi, Nov 23: ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితుడు తన ప్రేయసితో ఏకాంతంగా గడిపేందుకు ఓయో హోటల్‌ రూమ్‌ తీసుకున్నాడు. అయితే ఏమయిందో ఏమో తరువాత గొడవకు దిగి ఆమెను దారుణంగా తుఫాకీతో కాల్చి (Married man shoots girlfriend) చంపేశాడు.అనంతరం అతను కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి (tries to kill self) పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ప్రవీణ్‌కు కొన్నేళ్ల క్రితమే వివాహం జరిగింది. భార్య, పిల్లలతో ఢిల్లీలో జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో ప్రవీణ్‌కు గీత అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వీరి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో, వీరిద్దరూ పలుమార్లు ఢిల్లీలోని హోటల్స్‌లో కలుసుకునేవారు. ఈ క్రమంలోనే మంగళవారం కూడా వీరు ఓయో హోటల్‌లో రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. అనంతరం, రూమ్‌లో వారిద్దరూ గొడవకు దిగారు. గొడవ పెరిగి పెద్దది కావడంతో ప్రవీణ్‌.. ప్రియురాలి చాతిపై గన్‌తో కాల్చాడు. దీంతో, ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తర్వాత.. ప్రవీణ్‌ తనను తాను గన్‌తో కాల్చుకున్నాడు.

ఇద్దరూ నగ్నంగా ఆ పనిలో ఉండగా ప్రైవేట్ భాగాల్లో ఫెవిక్విక్ పోసి చంపాడు, రాజస్థాన్‌లో తాంత్రికుడి అఘాయిత్యం, మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఘటన

గన్‌ పేలిన శబ్ధం వినిపించడంతో హోటల్‌ సిబ్బంది వెంటనే రూమ్‌కు వెళ్లి చూడగా వారిద్దరూ కిందపడిపోయి ఉన్నారు. దీంతో, పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే గీత మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవీణ్‌.. గాయాలతో ప్రాణపాయం నుండి బయటపడ్డాడు.