Jaipur, NOV 23: తనను బ్లాక్ మెయిల్ చేసినుందుకు ఓ జంటను అతికిరాతకంగా హత్య చేశాడు రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన ఓ బాబా. వివాహేతర సంబంధంలో (illicit relationship) ఉన్న ఇద్దరు...ఉదయ్‌పూర్‌లోని కెలాబవాడి (Kelabavadi) అటవీ ప్రాంతంలో విగతజీవులుగా దొరికారు. అయితే వారిద్దరి శవాలపై నూలుపోగు కూడా లేదు. పైగా ఆ ఇద్దరూ సెక్స్ (SEX) చేస్తుండగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అక్రమ సంబంధాన్ని పసిగట్టిన కుటుంబ సభ్యులే వారిని హత్యచేసి ఉంటారని భావించారు. కానీ దర్యాప్తులో భాగంగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మృతులను స్థానికంగా ఉండే రాహుల్ (Rahul Meena), సోను (Sonu)లుగా గుర్తించారు. వారిని కుటుంబ సభ్యులు హత్య చేయలేదని, స్థానికంగా ఉండే ఓ బాబా హత్య చేశాడని గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే...భలేష్ కుమార్ (Bhalesh Kumar) అనే వ్యక్తి ఇచ్చాపూర్ణ సత్సంగ్ భావ్జీ మందిర్ ప్రాంతంలో కొన్నేళ్లుగా జీవిస్తున్నాడు. స్థానికంగా ఉండే ప్రజలకు జాతకాలు చెప్పడం, పూజలు చేయడంతో కొంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. హత్యకు గురైన రాహుల్ మీనా చాలా రోజులుగా బాబాకు తెలుసు. తరచూ పూజల కోసం అతని వద్దకు వచ్చేవాడు. ఇదే క్రమంలో అక్కడికి వచ్చిన సోను కున్వార్ తో రాహుల్ కు పరిచయం అయింది. అది కాస్తా వివాహేత సంబంధంగా (illicit relationship) మారింది.
అయితే ఈ విషయం నిందితుడు భలేష్ కుమార్ కు కూడా తెలుసు. దీంతో వారి సంగతిని రాహుల్ భార్యకు చెప్తా అని బెదిరించాడు. దీంతో ఆ ఇద్దరూ కలిసి బాబాను బ్లాక్ మెయిల్ చేశారు. తనను లైంగికంగా వేధిస్తున్నావని నీపై కేసు పెడతా అంటూ సోనూ రివర్స్ బ్లాక్ మెయిల్ చేసింది. దాంతో వారిద్దరిపై కక్ష పెంచుకున్నాడు భలేష్. ఇద్దరికి మంచి జరిగేందుకు ప్రత్యేక పూజలు చేయాలంటూ వారిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. తన ముందే ఇద్దరూ సెక్స్ చేయాలని సూచించాడు. దీంతో ఇద్దరూ ఆ పనిలో ఉండగా...అంతకు ముందే ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న ఫెవిక్విక్ (Super Glue)ను వారిపై పోశాడు. దీంతో ఇద్దరూ అతుక్కుపోయారు. బాబా చేసిన పనికి షాక్ లో ఉన్న ఇద్దరూ తేరుకునేలోపే...వారిపై కత్తితో దాడి చేశాడు.
ఫెవిక్విక్ పోయడంతో ఇద్దరూ ఒకరికి ఒకరు బాగా అతుక్కుపోయారు. ఈ క్రమంలో బలవంతంగా విడదీసుకునే ప్రయత్నంలో వారిద్దరి చర్మాలు ఊడి వచ్చాయి. అంతేకాదు రాహుల్ ప్రైవేట్ పార్టు కూడా పూర్తిగా ఊడిపోయింది. అటు సోనూ ప్రైవేట్ భాగాల్లో కూడా గాయాలయ్యాయి. మరోవైపు భలేష్ కూడా కత్తితో దాడి చేయడంతో అక్కడే మృతి చెందారు. ఈ ఘటన నవంబర్ 18న జరుగగా....మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. స్థానికులు కొందరు అడవిలో మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం బయటకు వచ్చింది.