Delhi Shocker: సొంతకుటుంబాన్నే నరికి చంపిన యువకుడు, దేశరాజధానిలో దారుణ ఘటన, ఇద్దరు అక్కలు, తండ్రి, నానన్మలను కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తింపు, హంతకుడు డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం
న్యూఢిల్లీలో (Delhi) దారుణం చోటుచేసుకున్నది. తన సొంత కుటుంబాన్ని మొత్తం నరికి చంపాడు ఓ యువకుడు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని పాలమ్ (Palam area) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను విచక్షణరహితంగా కొట్టి చంపేశాడు యువకుడు. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
New Delhi, NOV 23: దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi) దారుణం చోటుచేసుకున్నది. తన సొంత కుటుంబాన్ని మొత్తం నరికి చంపాడు ఓ యువకుడు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని పాలమ్ (Palam area) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను విచక్షణరహితంగా కొట్టి చంపేశాడు యువకుడు. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతిచెందిన వారిలో ముగ్గురు మహిళలే ఉండటం గమనార్హం. ముగ్గురు మహిళల్లో ఒకరు ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో పడి ఉండగా, మరొ రెండు మృతదేహాలను బాత్‌రూమ్‌లో గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
Delhi | Four members of a family including two sisters, their father and their grandmother were stabbed to death in a house in Palam area. The accused has been apprehended: Delhi Police
— ANI (@ANI) November 23, 2022
నిందితుడు డగ్స్‌కు బానిసగా (Drug addict) మారాడని చెప్పారు. డ్రగ్స్ కారణంగానే ఈ హత్యలు జరిగి ఉంటాయిని భావిస్తున్నారు. నిందితుడ్ని కేశవ్‌గా గుర్తించారు. అతను కొద్ది రోజులుగా డ్రగ్స్ మానేసేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉండి చికిత్స తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మధ్యనే అక్కడి నుంచి ఇంటికి వచ్చాడని చెప్పారు. దీంతో డ్రగ్స్ కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తనతో సహజీవనం చేస్తున్న యువతిని చంపి... ముక్కలు ముక్కలుగా చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోనే మరోసారి ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ హత్యలకు గల కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Nov 23, 2022 08:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

