పంజాబ్ మొహాలీలో ఓ మహిళా పోలీస్ అధికారి అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకుంటూ సీసీ టీవీ పుటేజీకి చిక్కింది. నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు బాధితురాలి నుంచి రూ.20వేలు వసూలు చేసింది. స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఏఎస్‌ఐ డబ్బు తీసుకున్న దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఏఎస్‌ఐ పర్వీన్ కౌర్ లంచం తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీఎస్‌పీ దర్పణ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. విజిలెన్స్ బ్యూరో దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
A woman assistant sub-inspector (ASI) posted in Mohali has been booked for taking ₹20,000 bribe from a rape victim, after a video of the incident started doing rounds of the social mediahttps://t.co/SIsZ7wLEUA
— HT Punjab (@HTPunjab) November 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)