Representational Picture (photo credit- File image)

Mumbai, November 22: పంజాబ్‌లో జరిగిన ఓ షాకింగ్ సంఘటనలో నలుగురు మహిళలు జలంధర్‌లో ఫ్యాక్టరీ కార్మికుడిని కిడ్నాప్ (Four Women Kidnap Factory Worker) చేసి బందీగా ఉంచారు. నివేదికల ప్రకారం, ఆదివారం రాత్రి ఆ వ్యక్తిని నలుగురు మహిళలు కిడ్నాప్ చేశారు. మహిళలు రాత్రంతా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని (Rape Him Overnight in Jalandhar) ఆ వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. భయానక రాత్రి ముగిసిన తర్వాత, నలుగురు మహిళలు ఆ వ్యక్తిని రోడ్డుపై వదిలి అక్కడి నుండి పారిపోయారని బాధితుడు తెలిపారు.

ఆ వ్యక్తి తనకు ఎదురైన బాధను మీడియాకు వివరించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే, అతను ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని బాధితుడు తెలిపాడు.నలుగురు మహిళలు లెదర్ కాంప్లెక్స్ రోడ్డుపై కారులో వచ్చి తనను కిడ్నాప్ చేశారని ఆ వ్యక్తి చెప్పాడు. నలుగురు మహిళలు తనతో శారీరక సంబంధం పెట్టుకున్నారని, అత్యాచారం చేశారని అతను పేర్కొన్నాడు. అడ్రస్ అడిగే సాకుతో మహిళలు తనను అడ్డగించారని ఆ వ్యక్తి చెప్పాడు. అడ్రస్‌ను చూపుతుండగా మహిళలు తనను స్పృహ కోల్పోయేలా చేశారని తెలిపాడు.

అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలంటే రూ. 20 వేలు ఇవ్వాల్సిందే, అత్యాచార బాధితురాలి నుంచి లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్ అధికారి

అనంతరం వారు అతనిని కారులో ఎక్కించిన తరువాత తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు.నలుగురు మహిళలు 22 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్కులేనని చెప్పాడు. స్పృహలోకి రాగానే బట్టలు లేకుండా తాడుతో బంధించి ఉండడం చూశానని కూడా చెప్పాడు.నలుగురు మహిళలు తనను 11 నుంచి 12 గంటల పాటు బందీగా ఉంచారని, ఆ తర్వాత తెల్లవారుజామున 3 గంటల సమయంలో తనను రోడ్డుపై వదిలేశారని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. అవమానానికి భయపడి పోలీసులను ఆశ్రయించలేదని ఆ వ్యక్తి చెప్పాడు. కాగా, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని ఠాణా బస్తీ బావా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ గగన్‌దీప్ సింగ్ సెఖోన్ తెలిపారు. ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని, దర్యాప్తు ప్రారంభిస్తామని సింగ్ చెప్పారు.