Delhi Violence: రణరంగంగా దేశ రాజధాని, రంగంలోకి ఆర్మీ బలగాలు, వెంటనే కర్ఫ్యూ విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్, 20కి చేరిన మృతుల సంఖ్య
గత మూడు రోజులుగా ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, కరవల్‌నగర్, గోకుల్‌పురి, భజన్‌పురా, జఫరాబాద్‌లలో చోటు చేసుకున్న హింసలో 20 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు.
New Delhi, February 26: దేశ రాజధాని ఢిల్లీ పౌరసత్వ సవరణ చట్టం (CAA) అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళలనతో (Delhi violence) అట్టుడుకుతోంది. గత మూడు రోజులుగా ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని మౌజ్‌పూర్, చాంద్‌బాగ్, కరవల్‌నగర్, గోకుల్‌పురి, భజన్‌పురా, జఫరాబాద్‌లలో చోటు చేసుకున్న హింసలో 20 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు.
అర్థరాత్రి రంగంలోకి దిగిన అజిత్ డోవల్
బుధవారం ఉదయం కూడా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టలేదు. చాలాచోట్ల 144వ సెక్షన్ (144 Section) విధించినా దాన్ని పాటించేవారే కరువయ్యారు. వీధుల్లో ముష్కరుల స్వైరవిహారం చేశారు. కొన్ని చోట్ల ఇరు వర్గాల రాళ్ల దాడి కొనసాగుతోంది. ఈరోజు ఉదయం గోకుల్‌పురి ప్రాంతంలో ఆందోళనలకు దిగిన కొందరు అల్లరిమూకలు ఒక దుకాణానికి నిప్పుపెట్టి పారిపోయారు.
ఢిల్లీలో (Delhi) ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను నియంత్రించేందుకు పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారన్నారు. అదనపు బలగాలు మోహరించినా కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు.
సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అలీఘడ్‌లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేత
ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని రంగంలోకి దించాలన్న కేజ్రీవాల్.. ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే కర్ఫ్యూ విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తున్నానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులపై ఈ మంత్రివర్గంలో చర్చిస్తున్నట్లు సమాచారం.
ఉగ్రవాదుల ఇళ్లపై మూకుమ్మడి దాడులు
కాగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గతరాత్రి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సీలంపూర్, జఫ్రాబాద్, మౌజ్‌పూర్, గోకుల్‌పురి చౌక్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈశాన్య ఢిల్లీలో 3 రోజులుగా చెలరేగుతున్న అల్లర్లలో హింసకు పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మంగళవారం వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈశాన్య దిల్లీలో 'కనిపిస్తే కాల్చివేత' ఆదేశాలు
వీటిపై బుధవారం విచారిస్తామని ఆయా కోర్టులు కక్షిదారులకు తెలిపాయి. అయితే, ఘర్షణల్లో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఘర్షణలపై కేంద్ర కేబినెట్ బుధవారం ఉదయం భేటీ అయింది.
మరోవైపు ఢిల్లీలో జరుగుతున్న హింసాకాండలో అమరుడైన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. రతన్‌లాల్‌ను అమరవీరుల జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో చెలరేగిన హింసాకాండను అదుపు చేసే ప్రయత్నంలో రతన్‌లాల్ మృతి చెందారు. కాగా ప్రస్తుతం ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్‌పూర్, బాబర్ పూర్, చాంద్‌బాగ్ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.