Due To Food Poisoning 200 People Fall Sick: చావు ఇంట్లో భోజనం తిని 200 మందికి అస్వస్థత, ఆ స్వీట్ తిన్న వాళ్లంతా ఆస్పత్రి పాలయ్యారన్న డాక్టర్లు, గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు
ఈ సందర్భంగా అతిథులకు సాంప్రదాయ ‘జల్పాన్’, పఫ్డ్ రైస్, క్రీమ్‌తో కూడిన స్నాక్స్ ఇచ్చారు. అది తిన్న సుమారు 200 మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఇబ్బందిపడ్డారు.
Golaghat, OCT 20: స్మారక కార్యక్రమానికి హాజరైన వారు అక్కడ సర్వ్ చేసిన స్నాక్స్ తిన్నారు. అనంతరం 200 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల (food poisoning) కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఆసుపత్రిపాలయ్యారు. అస్సాంలోని గోల్‌ఘాట్ జిల్లాలో (Golaghat) ఈ సంఘటన జరిగింది. సరుపతర్ ప్రాంతం ఉరియమ్‌ఘాట్‌లోని పాస్‌ఘోరియా గ్రామంలో ప్రదీప్ గొగోయ్ తల్లి స్మారక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అతిథులకు సాంప్రదాయ ‘జల్పాన్’, పఫ్డ్ రైస్, క్రీమ్‌తో కూడిన స్నాక్స్ ఇచ్చారు. అది తిన్న సుమారు 200 మందికిపైగా వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలతో ఇబ్బందిపడ్డారు.
Health Tips: ఈ అలవాట్లను వెంటనే మానుకోకపోతే ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు
కాగా, 53 మందిని సరుపత్తర్ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఉరియమ్‌ఘాట్‌లోని పబ్లిక్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని జోర్హాట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. స్వల్ప లక్షణాలున్న 150 మందికి ప్రాథమిక చికిత్స తర్వాత ఇళ్లకు పంపివేశారు.
మరోవైపు ఆ గ్రామాన్ని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సందర్శించి ఫుడ్ పాయిజన్ కారణాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఫంక్షన్‌కు వచ్చిన వారందరి ఇళ్లకు వైద్య బృందాలను పంపి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తామని వెల్లడించారు.