కొన్నిసార్లు మనం చేసే పొరపాట్ల వల్ల ప్రమాదకరమైన వ్యాధులు కారణమవుతాయి.. కొన్ని అలవాట్లను మానుకున్నట్లయితే ప్రేగు క్యాన్సర్ నుంచి దూరమవ్వచు. అయితే ముఖ్యంగా ప్రేగు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి- నేటి జీవనశైలిలో అనేకమంది బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ఇది మీ ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి పెరగడం ద్వారా మన శరీరంలో అనేక అవయవాల పైన కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుం.ది రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమందిలో అల్సర్సు ,వాపులకు కూడా కారణం అవుతుంది. తర్వాత ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మీరు ప్రతి రోజు యోగా ,వ్యాయామాలు వంటివి చేర్చుకున్నట్లైతే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
ప్రాసెస్ చేసిన ఆహారాలు- ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా పెరుగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఊరగాయలు ప్రాసెస్ చేసిన ఆహారాలు పాప్పడు చిప్స్ వంటి వాటిలలో అధిక శాతం సోడియంను కలుపుతారు. అధిక ఉప్పు తినడం వల్ల కడుపులోని పేగు కి పైన పొర ఇబ్బందికి గురిచేస్తుంది. ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధికి దారితీస్తుంది. ఒక పరిశోధన ప్రకారం ఉప్పు వినియోగించిన వారిలో 40 శాతం కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెంచుతుంది. కాబట్టి మీరు తీసుకున్న ఆహారంలో తాజా పండ్లు కూరగాయలతోటి ఉండాలి. ఉప్పును కాస్త తక్కువగా తీసుకోవడం ఉత్తమం.
Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..
ధూమపానం- సిగరెట్ తాగడం వంటివి ఊపిరితిత్తులపైనే కాకుండా పొట్టలో ఉన్న ప్రేగుల పైన కూడా ప్రభావాన్ని చూపుతుంది. ధూమపానం అధికంగా చేయడం వల్ల కడుపులో మంట అల్సస్ వంటివి ఏర్పడతాయి. ఇవి తర్వాత కాలంలో క్యాన్సర్ కి కారణం అవుతాయి. ధూమపానం చేసేవారిలో పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా రేట్లు పెరుగుతుంది. ధూమపానాన్ని మానివేయడం ద్వారా మీ మిగతా ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వారు అవుతారు.
మద్యపానం- ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న లోపటి పొరలు బలహీనపడతాయి. వీటి ద్వారా ఆసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి పేగులను డైలీ చేస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మద్యం వినియోగాన్ని తగ్గించుకున్నట్లయితే లేదా పూర్తిగా మానేసినట్లయితే కడుపుకు సంబంధించిన అనేక జబ్బులను తగ్గించుకోవచ్చు..
కడుపు క్యాన్సర్ తీవ్రమైన వ్యాధి. ప్రతిరోజు మీరు చేసే కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. కాబట్టి జీవనశైన్లు మెరుగుపరచుకోవడం ముఖ్యం ఒత్తిడిని తగ్గించుకోవడం ఉప్పును మానివేయడం ధూమపానం మద్యపానాన్ని తగ్గించడము వంటి అలవాట్లు చేసుకున్నట్లయితే పేగు సంబంధ క్యాన్సర్ను నివారించుకోవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి