Gujarat Assembly Elections Schedule: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రెడీ, ముహూర్తం ఖరారు చేసిన ఈసీ, మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్, డిసెంబర్ 8న కౌంటింగ్ ఉండే అవకాశం
అయితే, బీజేపీలో కీలకంగా ఉన్న ప్రధాని మోదీ (Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాల (Amith shah) సొంత రాష్ట్రం గుజరాత్ కావటంతో వరుసగా ఆరోసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది.
Ahmadabad, NOV 03: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను (Gujarat Assembly elections) ఎన్నికల సంఘం (Election Commission) ఇవాళ విడుదల చేయనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల తేదీల వివరాలను ఈసీ (EC) వెల్లడించనుంది. గత నెలలో ఈసీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్‌ను (Himachal Pradesh Elections) ప్రకటించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల 2022 షెడ్యూల్‌ను ప్రకటించకుండా ఎందుకు దాటవేసిందనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. 2017లో కూడా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను వేర్వేరుగా ప్రకటించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు. హిమాంచల్ ప్రదేశ్ షెడ్యూల్‌ను ముందుగా ప్రకటించడానికి హిమాంచల్ ప్రదేశ్ వాతావరణం ఒక కారణమని ఆయన పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 12న పోలింగ్, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం 18 ఫిబ్రవరి 2023తో ముగుస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం 8 జనవరి 2023తో ముగుస్తుంది. ఇదిలాఉంటే బీజేపీ, ఆప్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలవడంతో గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly elections) ఎన్నికల పోరు ఉత్కంఠగా మారింది. ఇప్పటికే బీజేపీ, ఆప్ తో పాటు ఇతర పార్టీలు గుజరాత్ లో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే గుజరాత్ లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ బీజేపీపై విమర్శల దాడిచేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలుసైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తోంది.
2017లో మొత్తం 182 సీట్లకు గాను 99 సీట్లు బీజేపీ గెలుచుకోగా, 77 సీట్లు కాంగ్రెస్‌తో ఉన్నాయి. అయితే, బీజేపీలో కీలకంగా ఉన్న ప్రధాని మోదీ (Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాల (Amith shah) సొంత రాష్ట్రం గుజరాత్ కావటంతో వరుసగా ఆరోసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అధికార పార్టీ ఉవ్విళ్లూరుతోంది.