Gujarat: గుజరాత్ గేమింగ్ జోన్ లో ప్రమాదం, 22 మంది సజీవ దహనం, మృతుల్లో ఎక్కువగా చిన్నారులే!, మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం
శనివారం సాయంత్రం టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో (Gaming Zone) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 22 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు.
Rajkot, May 25: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Breaks Out) సంభవించింది. శనివారం సాయంత్రం టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో (Gaming Zone) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో చిక్కుకుని 22 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. లోపల మరింత మంది చిక్కుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రమాదం గురించి తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా, పెద్ద ఎత్తున గాలి దుమారం వచ్చినప్పటికీ శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కాగా, మృతుల సంఖ్యను సరిగ్గా అంచనా వేయలేమని ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఆర్‌ఏ జోబన్ తెలిపారు. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నామని పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.