Stimulus Package 2.0: రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ, రైతులు,వలస కూలీలు,చిన్న వ్యాపారులకు ప్యాకేజీ ద్వారా ఎంతో లబ్ది, 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి

నిన్న సుమారు రూ.6 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు రెండో దఫా ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. కాగా మొత్తం రూ.20 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రధాని మోదీ (PM Modi's ₹20 Lakh Cr Package) ప్రకటించిన విషయం విదితమే. అందులో తొలిదశ కింద ఎంఎస్ఎంఈలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి సాయం ప్రకటించారు. ఈ రెండో విడత ప్యాకేజి వలస కార్మికులు, వీధుల్లో విక్రయాలు సాగించేవాళ్లకు, సన్నకారు రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తుందని వివరించారు.

Image used for representational purpose. | Photo Wikimedia Commons

New Delhi, May 14: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో ప్యాకేజీని (Stimulus Package 2.0) ప్రకటిస్తున్నారు. నిన్న సుమారు రూ.6 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించారు. ఈ రోజు రెండో దఫా ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. కాగా మొత్తం రూ.20 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రధాని మోదీ (PM Modi's ₹20 Lakh Cr Package) ప్రకటించిన విషయం విదితమే. అందులో తొలిదశ కింద ఎంఎస్ఎంఈలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించి సాయం ప్రకటించారు. ఈ రెండో విడత ప్యాకేజి వలస కార్మికులు, వీధుల్లో విక్రయాలు సాగించేవాళ్లకు, సన్నకారు రైతులకు ఎంతో లబ్ది చేకూరుస్తుందని వివరించారు.  ప్రధాని మోదీ 'ఆత్మ నిర్భర్' గుట్టు విప్పిన కేంద్ర ఆర్థికమంత్రి, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అంటే స్వయం ఆధారిత భారతం, ఉద్దీపన ప్యాకేజీ వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

రెండో ప్రాధాన్యత రంగాలైన 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ (COVID-19 economic stimulus package)వివరాలు వెల్లడించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ రెండో ప్యాకేజీ ప్రకటన సందర్భంగా మంత్రి (FM Nirmala sitharaman) మాట్లాడుతూ... వలస కూలీలు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులపై దృష్టి పెట్టాం. సన్నకారు రైతులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నాం. సన్నకారు రైతులకు తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాం. 25 లక్షల మంది కిసాన్‌ కార్డుదారులకు రూ.25 వేల కోట్ల రుణాలు అందించాం. మార్చి 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు మూడు కోట్ల మంది రైతులకు రూ.86,600 కోట్లు చౌకగా రుణాలు ఇచ్చామని తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల కేటాయింపు, నగదు లభ్యత పెంచడమే ప్యాకేజీ లక్ష్యం, ఉద్దీపన చర్యల్లో భాగంగా 15 సహాయక చర్యలు

తగ్గింపు రేట్లతో 3 కోట్ల మంది రైతులకు ఇప్పటికే రూ.4.22 లక్షల కోట్లు రుణాల రూపంలో అందజేశామని వెల్లడించారు. గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులకు ప్రభుత్వం మార్చిలో రూ.29,500 కోట్లు రీఫైనాన్స్ చేసిందని అన్నారు. ఈ రెండో ప్యాకేజి ముద్ర యోజన, గృహ కల్పన, ఉద్యోగ కల్పన రంగాలకు కూడా చేయూతనిస్తుందని తెలిపారు. అంతేకాకుండా, సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31 వరకు రాయితీ పొడిగిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ రుణాలపై మూడు నెలల వరకు మారిటోరియం ఉంటుందని తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు శుభవార్త, ఐటీ రిటర్న్ 2019-20 గడువు నవంబర్ వరకు పొడిగింపు, టీడీఎస్ రేట్లు 25 శాతం తగ్గింపు

గిరిజనులకు ఉపాధి కల్పించే అవకాశాలపైనా కేంద్రం ప్రత్యేకం దృష్టి సారించిందని తెలిపారు. గిరిజనులకు ఉపాధి అవకాశాలపై, ముద్ర యోజన, హౌసింగ్‌, ఉద్యోగాల కల్పన అంశాలపై ప్యాకేజీ ప్రకటించాం. గ్రామీణ మౌళిక రంగానికి రూ. 4200 కోట్లు కేటాయించామని తెలిపారు. పట్టణ పేదలు, వలస కూలీలకు అన్నపానీయాల కోసం ఏర్పాట్లు చేశాం. సహాయ శిబిరాలు, భోజన ఏర్పాట్లుకు రూ.11 వేల కోట్లు కేటాయించాం. వలస కార్మికులకు నగదు పంపిణీ జరిగిందని ఆమె వివరించారు.

రోజుకు మూడు పూటలు అన్నపానీయాలకు కృషి చేస్తున్నాం. గ్రామీణ బ్యాంకులు, సహాకార బ్యాంకులకు మార్చిలో రూ. 29500 కోట్లు ప్రభుత్వం రీఫైనాన్స్‌ చేసిందని తెలిపారు. పట్టణ స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే రూ.12 వేల కోట్లు అందించామని, పైసా పోర్టల్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని అన్నారు.  ఎంఎస్‌ఎంఈలకు అర్థం మారింది, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను వెల్లడించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, పూర్తి వివరాలు ఇవే

పట్టణ ప్రాంతాల్లోని పేదలు, నిరాశ్రయులు, వలస కార్మికులకు కూడా ప్యాకేజిలో పెద్దపీట వేశారని, వారి సంక్షేమం కోసం భారీగా కేటాయించారని నిర్మలా సీతారామన్ తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif