Free Bus Travel For Karnataka Women: మహిళలకు ఉచిత ప్రయాణంపై ట్విస్ట్ ఇచ్చిన సిద్దారామయ్య, 20 కిలోమీటర్లు దాటితే డబ్బులు కట్టాల్సిందే! ఇంకా ఏయే షరతులు ఉన్నాయంటే!
కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు. ఈ విషయమై సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘ఐదు గ్యారంటీ హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించబోతున్నాం.
Bangalore, June 10: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (శక్తి యోజన) జూన్ 11వ తేదీన ప్రారంభం కానుంది. ఈ పథకం అన్ని కులాలు, మతాలు, తరగతులకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ (Karnataka Women) చేరేలా చూడాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంత్రులు శాసనసభ్యులను ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించనున్న ఈ పథకంలోని అసలు విషయాన్ని తాజాగా వెల్లడించారు. వాస్తవానికి ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.
ఈ విషయమై సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘ఐదు గ్యారంటీ హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించబోతున్నాం. అయితే ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏసీ బస్సులు, వోల్వోల్లో ఈ ప్రయాణ సౌకర్యం ఉండదు అలాగే 20 కిలోమీటర్ల పరిమితి వరకు మాత్రమే ఉచిత ప్రయాణం (Free Bus Travel) ఉంటుంది. ఉదహారణకు తిరుపతి వెళ్లనుకునే వారు బుల్బాఘల్ నుంచి ఆంధ్రప్రదేశ్ బార్డర్ (కోలార్ సరిహద్దు) వరకు మాత్రమే ఉచిత ప్రయాణం లభిస్తుంది. ఆ తర్వాత ప్రయాణానికి డబ్బులు చెల్లించాలి’’ అని అన్నారు. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రచారం.. ఉచిత బస్సు పథకం కర్ణాటకలో 50 శాతం జనాభాకు ఉపయోగపడుతుంది.
ఈ పథకంలోకి ట్రాన్స్‌జెండర్లను కూడా తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. BMTC, KSRTC, KKRTC, NWKRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద BMTC మినహా మిగిలిన మూడు రవాణా కార్పొరేషన్లలో పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేశారు. అదనంగా జీరో టికెట్/శక్తి స్మార్ట్ కార్డ్ డేటా ఆధారంగా రవాణా ఏజెన్సీలు చేసే ఖర్చును ప్రభుత్వం భరించనుంది. ఇక మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరం ఆధారంగా రోడ్డు రవాణా సంస్థకు రీయింబర్స్‌మెంట్ అవుతుంది. అయితే ఈ పథకం ఏసీ, లగ్జరీ బస్సులకు వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. అలాగే కర్ణాటక పరిధిలో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే కర్ణాటక బస్సుల్లో కానీ, కర్ణాటకలోకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సుల్లో కానీ అనుమతి ఉండదు.