Fuel Price Hike: దేశంలో కొనసాగుతున్న పెట్రో బాదుడు, తాజాగా 40 పైసలు పెంపు, గత 14 రోజుల వ్యవధిలో 12 సార్లు ఇంధన ధరలు పెంపు
కేంద్ర ప్రభుత్వం గ్యాప్‌లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. ఆదివారం పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు తాజాగా 40 పైసలు వడ్డించాయి.
New Delhi, April 4: దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం గ్యాప్‌లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. ఆదివారం పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు తాజాగా 40 పైసలు వడ్డించాయి. దీంతో గత 14 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం (Fuel Price Hike) ఇది పన్నెండోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్‌పై రూ.9.44, డీజిల్‌పై రూ.9.10 పెరిగింది.
తాజా పెంపుతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.103.81, డీజిల్ రూ.95.07కు చేరింది. ముంబైలో పెట్రోల్‌పై 84 పైసలు పెరగడంతో రూ.118.83కు పెరగగా, డీజిల్‌పై 43 పైసలు అధికమవడంతో రూ.103.07కు చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 45 పైసలు, డీజిల్‌పై 43 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.117.68కి, డీజిల్ రూ.103.75కి చేరింది. అత్యధికంగా రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ రూ.120.65 వద్ద ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో లీటర్ డీజిల్ రూ.105.52కి అమ్ముతున్నారు.
రెండేళ్ల తరువాత వెయ్యికి దిగువన కేసులు, కొత్తగా 913 మందికి కరోనా, గత 24 గంటల్లో 13 మంది మృతి
నిత్యం పెట్రో ధరలను పెంచుతుండటంపై కేంద్ర ప్రభుత్వం మీద కేరళ సీఎం విజయన్ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు వలన ద్రవ్యోల్బణం కూడా పెచ్చరిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓవైపు రాయితీల్లో కోత విధిస్తూ.. మరోవైపు పన్నుల భారం వేస్తూ కేంద్రం సామాన్యులను ఇబ్బందుల పాల్జేస్తున్నదని విమర్శించారు.