Fuel Prices Today: దేశంలో ఆగని పెట్రోమంటలు, వరుసగా 20 వరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు, నేడు పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెంపు

శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు ( Fuel Prices Today), డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 82.96 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర (Diesel price in Delhi) లీటర్‌కు 80.13కు, డీజిల్‌ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది.

Petrol Price In India | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, June 26: దేశంలో పెట్రో మంటలు (Petro Price Fire) కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు ( Fuel Prices Today), డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 82.96 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర (Diesel price in Delhi) లీటర్‌కు 80.13కు, డీజిల్‌ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది. కరోనా కల్లోలానికి తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య, దేశంలో రికార్డు స్థాయిలో 17,296 కేసులు నమోదు, 5 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

ఇక పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ధరల సవరణ పేరుతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇంధన ధరలను రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాయి. కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు పెట్రో ధరలను మించి డీజిల్‌ ధర పరుగులు తీయడంతో నిత్యావసరాల ధరలూ చుక్కలు చూస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర రూ. 83.18, డీజిల్‌ ధర రూ.78.36 పైసలు.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 22 పైసలు పెరిగింది. దీంతో ధర రూ.83.53కు చేరింది. డీజిల్‌ ధర కూడా 17 పైసలు పెరుగుదలతో రూ.78.67కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర లీటర్ రూ.83.13కు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్ రూ.78.30కు ఎగసింది.

20రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌కు రూ.8.93పైసలు, డీజిల్‌ లీటర్‌కు రూ.10.07పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 80.13 పైసలు, డీజిల్‌ ధర 80.19, చెన్నైలో పెట్రోల్‌ రూ. 83.37, డీజిల్‌ ధర రూ.77.44పైసలు పెరిగాయి. కోల్‌కతాలో పెట్రోల్‌ లీటర్‌కు రూ. 81.82, డీజిల్‌ ధర రూ.75.34 పైసలు పెరిగాయి. ముంబైలో పెట్రోల్‌ రూ. 86.91, డీజిల్‌ ధర రూ.78.51 పైసలుగా ఉంది.



సంబంధిత వార్తలు

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

New Virus In China: నూతన సంవత్సరం వేళ.. చైనాలో మరో కొత్త వైరస్ కలకలం.. కరోనా కల్లోలం ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న సమయంలో ‘హ్యూమన్ మెటానియా’ జూలు.. కిక్కిరిసిపోతున్న చైనా ఆసుపత్రులు (వీడియో)

Redmi Turbo 4 Launched: రెడ్‌మీ నుంచి సూపర్‌ ఫీచర్లతో మొబైల్, చైనా మార్కెట్లోకి వచ్చేసిన రెడ్‌మీ టర్బో 4, ఇంతకీ భారత్‌లోకి వచ్చేది ఎప్పుడంటే?

Andhra Tourist Killed in Goa: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు