Shekhawat Covid-19: జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కి కరోనా, ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కేంద్ర మంత్రి, అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై సందేహాలు
తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు కరోనా పాజిటివ్‌గా (Shekhawat tests positive for Covid-19) తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. ‘కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లాను. కరోనా టెస్ట్ చేయించాను. రిపోర్టులో పాజిటివ్ (Shekhawat Covid-19) అని వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. గత వారం రోజుల నుంచి నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ గజేంద్ర సింగ్ షెకావత్ హిందీలో ట్వీట్ చేశారు.
New Delhi, August 20: కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు కరోనా పాజిటివ్‌గా (Shekhawat tests positive for Covid-19) తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన స్వయంగా వెల్లడించారు. ‘కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లాను. కరోనా టెస్ట్ చేయించాను. రిపోర్టులో పాజిటివ్ (Shekhawat Covid-19) అని వచ్చింది. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. గత వారం రోజుల నుంచి నన్ను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలి. హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ అంటూ గజేంద్ర సింగ్ షెకావత్ హిందీలో ట్వీట్ చేశారు.
గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా సోకడంతో ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల మధ్య జలవివాదాలను (River water disputes ) పరిష్కరించేందుకు కేంద్ర జలసంఘం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఉంటుందా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. గతంలో ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం (Apex Council Meeting) నిర్వహించాలని కేంద్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. అయితే, అదే రోజు తమకు అత్యంత ముఖ్యమైన సమావేశం, కేబినెట్ భేటీ ఉన్నందున ఆ రోజు కుదరదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం మరో తేదీని ఫిక్స్ చేసింది.
Here's The Tweet
ఈసారి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరుతారని తెలుస్తోంది. అలాగే, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. అయితే తాజాగా ఆయనకు కరోనా సోకడంతో ఈ భేటీ యథాతథంగా కొనసాగుతుందా ? లేక మరో తేదీకి వాయిదా పడుతుందా ? అన్నది తేలాల్సి ఉంది. దేశంలో కరోనాపై భారీ ఊరట, 21 లక్షలకు చేరువలో డిశ్చార్జ్ కేసుల సంఖ్య, తాజాగా 69,652 కేసులు నమోదు, యాక్టివ్‌గా 6,86,395 కేసులు, 53,866 మంది వైరస్‌తో మృతి
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 69,652 కేసులు నమోదు కాగా.. 977 మంది మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా ఉండగా 53,866 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.