New Delhi, August 20: దేశంలో గడచిన 24 గంటల్లో అత్యధికంగా 69,652 కేసులు (India Coronavirus Cases) నమోదు కాగా.. 977 మంది వైరస్ బారిన పడి మృతి (Covid Deaths) చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 28,36,926గా (Coronavirus in India) ఉండగా 53,866 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 6,86,395 యాక్టీవ్ కేసులు ఉండగా.. 20,96,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 58,794 మంది బాధితులు వైరస్ (Covid virus) నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 73.91 శాతం ఉండగా.. మరణాల రేటు 1.9 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలపింది.
భారత్‌లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20 లక్షలు దాటింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగింట ఒక వంతుగా ఉంది. దేశంలో రికవరీ రేటు 73.64 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.91 శాతానికి పడిపోయిందని తెలి పింది. ఆగస్టు 18 వరకు 3,17,42,782 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. దేశంలో కొత్తగా నమోదైన మరణాల్లో 85 శాతం ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
కేరళ రాష్ర్టంలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 2,333 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 50,231కు చేరింది. ఇవాళ 7గురు వ్యాధి బారిన పడి మరణించగా ఇప్పటివరకు 182 మంది మృత్యువాత పడ్డారని ఆరోగ్య మంత్రి కెకె శైలజ బుధవారం తెలిపారు. వివిధ ఆస్పత్రుల్లో 17,382 మంది ప్రస్తుతం వ్యాధి సోకి చికిత్స పొందుతుండగా.. నేడు 1,217 మంది వ్యాధి నుంచి కోలుకొన్నారు. అన్‌లాక్ 4లో సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయా? ఆగస్టు చివరినాటికి ముగియనున్న అన్‌లాక్ 3.0, సినిమా థియేటర్లు తెరిచేందుకు త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం
మొత్తం 32,611 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయినట్లు తెలిసింది. అత్యధికంగా తిరువనంతపురంలో 540 కేసులు నమోదు కాగా.. మలప్పురంలో 322, అలప్పుజ 253, ఎర్నాకుళం 230, కొట్టాయం 203 కేసులు నమోదయ్యాయని శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం గడిచిన 24 గంటల్లో 36,291 నమూనాలను పరీక్షించగా ఇప్పటివరకు 12,76,358 మందికి కరోనా పరీక్షలు చేశారు.
కర్ణాటకలో ఒక్కరోజే కొత్తగా 8,642 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా అందులో ఒక్క బెంగళూరు అర్బన్ పరిధిలోనే 2,804 కేసులున్నాయి. కరోనాతో బుధవారం మరో 126 మంది చనిపోయారు. ఇవాళ 7,201 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,49,590కు చేరింది. ప్రస్తుతం 81,097 యాక్టివ్ కేసులున్నాయి. మహమ్మారి నుంచి కోలుకుని 1,64,150 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 4,327కు చేరింది. దేశంలో నిశ్శబ్దంగా క్యాన్సర్ విజృంభణ, 2025 నాటికి క్యాన్సర్ కేసులు 15.7 లక్షలకు పెరిగే అవకాశం, ఐసీఎంఆర్ పరిశోధనలో వెల్లడి, పొగాకు వాడకమే కారణం
మహారాష్ట్రలో ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 13,165 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. బుధవారం రోజున 346 మంది మృతి చెందారు. ఇవాళ 9,011 మంది పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,28,642కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి 21,033 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,46,881కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,60,413 యాక్టివ్ కేసులున్నాయి.
తమిళనాడులో గత 24 గంటల్లో కొత్తగా 5,795 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 116 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,449కు, మరణాల సంఖ్య 6,123కు చేరింది. కాగా, గత 24 గంటల్లో 6,384 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 2,96,171 మంది కోలుకోగా ప్రస్తుతం 53,155 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.