Global Hunger Index 2020: దేశంలో మిన్నంటిన ఆకలి కేకలు, భారత్ కన్నా బెటర్‌గా నిలిచిన పొరుగుదేశాలు, 107 దేశాలకు గానూ 94వ స్థానంలో నిలిచిన ఇండియా, జనాభా పెరుగుదలే కారణమని తెలిపిన జీహెచ్‌ఐ
పట్టెడన్నం కోసం జానెడు పొట్టలు అల్లాడుతున్నాయి. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ ఆకలి సూచీలో (Global Hunger Index 2020) 107 దేశాలకు గాను మన దేశం 94వ స్థానంలో (India Ranks 94th in List of 107 Countries) నిలిచింది. ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh), మయన్మార్, పాకిస్తాన్‌లు (Pakistan) ఉన్నాయి. చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్ ర్యాంకింగ్‌లు సాధించాయి.
New Delhi, October 18: భారత దేశంలో ఆకలి కేకలు ఇంకా ఆగడం లేదు. పట్టెడన్నం కోసం జానెడు పొట్టలు అల్లాడుతున్నాయి. 2020 సంవత్సరానికి గాను ప్రపంచ ఆకలి సూచీలో (Global Hunger Index 2020) 107 దేశాలకు గాను మన దేశం 94వ స్థానంలో (India Ranks 94th in List of 107 Countries) నిలిచింది. ఆకలి అత్యంత తీవ్రంగా ఉన్న జాబితాలో భారత్‌తో పాటుగా పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh), మయన్మార్, పాకిస్తాన్‌లు (Pakistan) ఉన్నాయి. చైనా, బెలారస్, ఉక్రెయిన్, టర్కీ, క్యూబా, కువైట్ వంటి 17 దేశాలు అయిదు లోపు ర్యాంకుల్ని పంచుకొని టాప్ ర్యాంకింగ్‌లు సాధించాయి.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ) ఈ ఏడాది నివేదికను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. పౌష్టికాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల, అయిదేళ్లలోపు పిల్లల్లో ఎత్తుకు తగ్గ బరువు, మాతా శిశు మరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సూచీని రూపొందిస్తారు.మన దేశంలో ఇంకా 14శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సూచీలో ఆర్థికంగా, సామాజికంగా కాస్త మనకన్నా వెనుకబడిన దేశాలు మనకన్నా మెరుగైన స్థానంలో నిలిచాయి. గతేడాది మన దేశం 102వ ర్యాంక్ నుంచి 94వ స్థానానికి చేరుకుంది. అయితే మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్థాన్ మనకంటే మెరుగ్గా ఉన్నాయి.
నేపాల్, బంగ్లాదేశ్ వరుసగా 73, 75 ర్యాంకులను సాధించగా, పాకిస్థాన్ 88వ స్థానాల్లో ఉన్నాయి. వెల్తుంగర్‌హిల్ఫ్, కన్సర్న్ వరల్డ్‌వైడ్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 27.2 స్కోరుతో దేశంలో ఆకలి స్థాయి తీవ్రంగా ఉంది. ఈ నివేదిక 132 దేశాల పరిస్థితిని అంచనా వేసినప్పటికీ.. 107 దేశాలకు డేటాను విడుదల చేసింది. కొవిడ్ -19 మహమ్మారి చాలా మందికి ఆహారం, పోషకాహార భద్రతను దెబ్బతీసింది. దీని ప్రభావం భవిష్యత్‌పై పడే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. ప్రస్తుత నివేదిక ఆకలి, పోషకాహారలోపంపై కొవిడ్ -19 ప్రభావాన్ని ప్రతిబింబించదని పేర్కొంది.
ఇండియాలో ఆకలి కేకలు ఎక్కువవడానికి కారణం పెరుగుతున్న జనాభేనని జీహెచ్‌ఐ అభిప్రాయపడింది. భారత్‌లో 14% జనాభా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 37.4% మందిలో ఎదుగుదల లోపాలు ఉన్నాయి. అయిదేళ్ల లోపు వయసున్న వారిలో 17.3% మంది ఎత్తుకి తగ్గ బరువు లేరు.అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 3.7%మంది మృత్యువాత పడుతున్నారు.
పుట్టుకతో వచ్చే ఆస్ఫిజియా లేదా ట్రామా, నియోనేటల్ ఇన్ఫెక్షన్లు, న్యుమోనియా, డయేరియాతో పిల్లల మరణాల రేటు చాలా వరకు తగ్గిందని నివేదిక పేర్కొంది. మెరుగైన ప్రసూతి సంరక్షణ, విద్య, పోషణతో పాటు రక్తహీనత, నోటి పొగాకు వాడకం తగ్గింపు వంటి చర్యల ద్వారా అధిగమించిందని తెలిపింది. 2020 జీహెచ్‌ఐ ప్రకారం.. ర్యాంకు పొందిన ఏ దేశం ఆకలిపై ‘అత్యంత ప్రమాదకరమైన’ విభాగంలోకి రావు. చాద్, తైమూర్-లెస్టే, మడగాస్కర్ దేశాలు ‘ప్రమాదకరమైన’ కేటగిరీకిందకు వచ్చాయి.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి అతి పెద్ద రాష్ట్రాలు పౌష్టికాహార లోపాలను అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని తెలిపింది. నిరక్షరాస్యులే తల్లులుగా మారడం, వారిలో రక్తహీనత లోపాలు వంటివి కూడా కారణమని తెలిపింది.