Virender Sehwag (photo-X)

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో బంగ్లాపై గెలుపుతో భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. నిన్న (ఫిబ్రవరి 20) దుబాయ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. కాగా 229 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు భారత్ ఏకంగా 46.3 ఓవర్ల సమయం తీసుకుంది. దీనిపై భారత్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. టీమిండియా ఇంకాస్త ముందుగానే టార్గెట్‌ను చేధిస్తుందని భావించానని సెహ్వాగ్ (Virender Sehwag) అన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (ICC Champions Trophy 2025) భారత అభిమానులు టెన్షన్ పడి ఉంటారు నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రత్యర్ధిగా ఉన్నది బంగ్లాదేశ్‌ అని అన్నాడు. మీరు బంగ్లాను చాలా అద్భుతమైన జట్టుగా నాతో పొగిడించు కోవాలనుకుంటున్నారా? అలా జరగాలంటే వారు ఆట తీరులో మార్పు రావాలని సెహ్వాగ్ అన్నారు.

విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, రషిద్‌ బౌలింగ్‌‌లో బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద సౌమ్య సర్కార్ కు దొరికిపోయిన భారత్ స్టార్ బ్యాటర్

బంగ్లాదేశ్‌తో ఆడేటప్పుడే టెన్షన్ పడడానికి ప్ర‌త్య‌ర్ది ఏమైనా పాకిస్తానా..? ఆస్ట్రేలియానా? ఇది చాలా ఈజీ మ్యాచ్‌. దాదాపు నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ల‌క్ష్యాన్ని చేధించారు. గిల్ అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత దూకుడుగా ఆడిన గిల్‌.. ఆ త‌ర్వాత కొంచెం నెమ్మ‌దిగా ఆడాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లేదా శ్రేయాస్ అయ్యర్ ఎక్కువసేపు క్రీజులో ఉండి ఉంటే, ఈ మ్యాచ్లో 35 ఓవ‌ర్ల‌లోనే ముగిసి ఉండేద‌ని" క్రిక్‌బ‌జ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.