Novel Corona Virus: చైనా నుంచి మరో ప్రమాదకరమైన వైరస్, ఆ దేశానికి వెళ్లవద్దని కేంద్రం హెచ్చరిక, ఇప్పటికే చైనాలో 41 మందికి సోకిన వైరస్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆ దేశంలో ఇప్పుడు కొత్త వైరస్ (New virus) ఒకటి వ్యాప్తి చెందుతోందని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వీలయితే ఆ దేశ పర్యటన రద్దు చేసుకోవాలని కోరింది. ఇప్పుడు చైనాలో ప్రమాదకర ‘నావల్ కరొనా’ వైరస్ (novel corona virus) వ్యాప్తి చెందుతోంది.
Beijing,January 18: చైనా ( China) పర్యటనకు వెళ్లే భారతీయులకు(Indians) కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశంలో ఇప్పుడు కొత్త వైరస్ (New virus) ఒకటి వ్యాప్తి చెందుతోందని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వీలయితే ఆ దేశ పర్యటన రద్దు చేసుకోవాలని కోరింది. ఇప్పుడు చైనాలో ప్రమాదకర ‘నావల్ కరొనా’ వైరస్ (novel corona virus) వ్యాప్తి చెందుతోంది.
ఈ వైరస్ ద్వారా ఇప్పటికే అక్కడ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు, డజనుకు పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ చదువుతున్న వందలాది భారతీయ విద్యార్థులకు కేంద్రం అలర్ట్ మెసేజ్ (Alert Message) ఇచ్చింది.
ఈ వైరస్ మొదటగా చైనా విశ్వవిద్యాలయం వుహాన్‌లో కనుగొనబడింది. అయితే ఇక్కడ దాదాపు 500 మందికి పైగా భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా న్యూ ఇయర్ వేడుకల కోసం ఇండియాకు వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది.
గ్రహాంతరవాసుల గుట్టు చైనా చేతిలో, అతిపెద్ద టెలిస్కోప్‌ను ప్రారంభించిన చైనా
వారందరికీ ఎయిర్ పోర్టులో వైద్య పరీక్షలు నిర్వహించింది. వీరితో పాటుగా చైనా నుంచి తిరిగి వస్తున్న యాత్రికులను కేంద్ర ఆరోగ్య శాఖ థర్మల్ స్కానర్లతో పరీక్షిస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల విమానాశ్రయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
చైనాలో ఈ వైరస్ 41 మందికి సోకగా, ఒకరు మృతి చెందారని ఆ దేశం ఈ నెల 11న ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ లేనప్పటికీ చైనాలో ఒకరి నుంచి ఒకరికి దగ్గు, తుమ్ముల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతోందని గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన కేంద్ర మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో కలసి నియంత్రణ కోసం కృషి చేస్తోందని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి ప్రీతి సుడాన్ చెప్పారు.
కృత్రిమ చంద్రుడిని తయారు చేస్తున్న చైనా
ఈ వైరస్ గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ కొన్ని జాగ్రత్తలను కేంద్రం సూచిస్తోంది. పొలాలకు, జంతుశాలలకు, జంతువధ స్థానాలకు వెళ్లవద్దని తెలిపింది. మాంసానికి దూరంగా ఉండాలని, ఒకవేళ తినాల్సి వస్తే బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాల్సిందిగా సూచించింది.
ఈ వైరస్ లక్షణాలు ప్రధానంగా జ్వరం, రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటివి ఉంటాయి. అయితే మానవ సంపర్కం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందడం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు.
కాగా థాయ్‌లాండ్, జపాన్ లో కూడా ఈ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు చైనా నుండి వచ్చినవి కావడంతో ఇప్పుడు అక్కడ ఆందోళన మొదలైంది. 2020 జనవరి 11 నాటికి ఇప్పటివరకు 41 ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ కేసును చేధించడానికి వైద్య నిపుణులు ఇప్పటికే చైనాకు చేరుకున్నారు.
భారతదేశానికి తిరిగి వెళ్ళేటప్పుడు "విమానంలో మీకు అనారోగ్యం అనిపిస్తే, వెంటనే విమానయాన సిబ్బందికి తెలియజేయండి, విమానయాన సిబ్బంది నుండి మాస్క్ తీసుకోండి, కుటుంబ సభ్యులు లేదా తోటి ప్రయాణికులతో సన్నిహిత సంబంధాలు నివారించండి" అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.