Gujarat : భార్య కదలలేని స్థితిలో మంచంపై ఉన్నా అది కావాలని వేధించిన భర్త, నన్ను కాపాడాలంటూ అభయంకు ఫోన్ చేసి మొరపెట్టుకున్న భార్య

శృంగారం కోసం 89 ఏళ్ల తన భర్త పెడుతున్న పోరును తట్టుకోలేకపోతున్నానంటూ ఓ 87 ఏళ్ల వృద్ధురాలు హెల్ప్‌లైన్‌ను (87-year-old woman calls Abhyam helpline) ఆశ్రయించింది.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Vadodara, Sep 13: గుజరాత్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. శృంగారం కోసం 89 ఏళ్ల తన భర్త పెడుతున్న పోరును తట్టుకోలేకపోతున్నానంటూ ఓ 87 ఏళ్ల వృద్ధురాలు హెల్ప్‌లైన్‌ను (87-year-old woman calls Abhyam helpline) ఆశ్రయించింది. తన భర్త నుంచి కాపాడాలని వేడుకుంది. వృద్ధుడి విషయం తెలుసుకున్న సిబ్బంది నిర్ఘాంత పోయారు. గుజరాత్ లోని వడోదరకు చెందిన ఓ 89 ఏళ్ల వృద్ధుడు తన భార్య(87)ను నిత్యం కామవాంఛ తీర్చాలని (89-year-old hypersexual husband's demands) వేధిస్తున్నాడు.

తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె నిరాకరిస్తోంది. అయినా అతడిలో మార్పు లేదు. ఒకటే గొడవ చేస్తుండటంతో వేగలేపోయింది. ఇంత లేటు వయసులో కూడా అతడిలో లైంగిక ఉద్దీపణలు ఈ స్థాయిలో ఉండటంతో ఏం చేయాలో కూడా భార్యకు అర్థం కాలేదు.

బస్సులో చిన్నారిపై తెగబడిన కామాంధుడు, గొంతు నొక్కిపెట్టి మూడున్నరేళ్ల విద్యార్థినిపై డ్రైవర్ దారుణంగా అత్యాచారం,దారుణానికి సహకరించిన ఆయా

ఈ నేపథ్యంలోనే ఆ భాధితురాలు మహిళల కోసం గుజరాత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 181 అభయం’ పేరుతో టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌‌కు కాల్ చేసింది. ఈ వయసులోనూ సెక్స్‌ కోసం తన భర్త తీవ్రంగా వేధిస్తున్నాడని, దాన్ని నిరాకరిస్తున్న తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని వాపోయింది. అనారోగ్యంతో ఉన్నానని, అలసటగా ఉందని చెబుతున్నప్పటికీ ఆయన పట్టించుకోవడంలేదని కన్నీటిపర్యంతమయ్యింది.

దెయ్యాలు వదిలిస్తానంటూ అత్తాకోడళ్లపై దారుణంగా అత్యాచారం, నగ్నంగా పూజలో కూర్చోబెట్టి దేవత ఆ పని చేయాలని చెప్పిందంటూ ఇద్దరిపై తెగబడిన కామాంధుడు

దీంతో ‘అభయం’ బృందం.. ఆ వృద్ధ జంట ఇంటికి చేరుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చింది. యోగా, ధాన్యంపై మనసును లగ్నం చేయాలని, మతపరమైన ప్రదేశాలను సందర్శించాలని ఆ వృద్ధుడికి సూచించింది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం ఆయనను సెక్సాలజిస్ట్‌కు చూపించాలని కుటుంబసభ్యులకు సూచించామని తెలిపారు. శృంగార వాంఛ పక్కదారి పట్టేందుకు ప్రతి రోజు యోగా చేయాలని సూచించారు. పార్కులు, పబ్లిక్ స్థలాలు, చారిత్రక ప్రదేశాలు దర్శించి మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు.