Bhopal, Sep 13: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన (Madhya Pradesh Shocker) చోటు చేసుకుంది. మూడున్నరేళ్ల నర్సరీ స్కూల్ విద్యార్థినిపై స్కూల్ బస్ డ్రైవర్ మహిళా సహాయకురాలి సమక్షంలో అత్యాచారానికి (Nursery kid raped inside school bus) పాల్పడ్డాడు. నోరు నొక్కిపెట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఘటనలో ఆమె నేరాన్ని కప్పిపుచ్చడానికి (woman helper tried to cover Up Crime ) ప్రయత్నించింది.
పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. విద్యార్థిని తల్లి శరీరంపై గుర్తులు చూసి ఏమైందని ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె ఈ కీచక పర్వాన్ని తన తల్లికి చెప్పగానే, కుటుంబం పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించింది.
వారు ఈ ఆరోపణలను ఖండించారు.దీని తర్వాత ఆ పాప తల్లి పోలీసులకు సమాచారం అందించింది. అత్యాచారానికి పాల్పడిన డ్రైవర్‌ను లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అరెస్టు చేసి, అత్యాచారం కేసు నమోదు చేశారు. ఈ నేరాన్ని దాచడానికి ప్రయత్నించిన సహాయకుడిని కూడా అరెస్టు చేశారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ, నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, పాఠశాల అధికారులు కూడా నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని, వారిని కూడా విచారిస్తామని, దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.