America Tragedy: గన్ మిస్‌ ఫైర్‌.. అమెరికాలో హైదరాబాద్ యువ‌కుడి మృతి.. బ‌ర్త్‌ డే రోజే విషాదం.. మృతుడు ఉప్ప‌ల్ వాసి ఆర్య‌న్ రెడ్డిగా గుర్తింపు

అమెరికాలో తెలుగు యువ‌కుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

Aryan Reddy (Credits: X (Big TV)

Hyderabad, Nov 22: పుట్టినరోజే (Birthday) ఆ యువకుడి జీవితంలో చివరి రోజుగా మారింది. అమెరికాలో తెలుగు యువ‌కుడు (Telugu Student) ప్రమాదవశాత్తూ మృతి చెందిన  ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. హైద‌రాబాద్‌ లోని ఉప్ప‌ల్ నివాసి ఆర్య‌న్ రెడ్డి (23) త‌న వ‌ద్ద ఉన్న తుపాకీని క్లీన్ చేసే క్ర‌మంలో అది మిస్‌ ఫైర్ కావ‌డంతో ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అమెరికా పోలీసులు వెల్ల‌డించారు. ఆర్యన్  పుట్టిన రోజు నాడే ఈ విషాద ఘ‌ట‌న చోటుచేసుకోవడం పలువురిని కలిచివేస్తున్నది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. హైదరాబాద్ ఉప్ప‌ల్ లో  కళ్యాణ్ పురికి చెందిన ఆర్య‌న్ రెడ్డి అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా న‌గ‌రంలో ఎంఎస్ చ‌దువుతున్నాడు. ఈ నెల 13న ఆర్య‌న్ బ‌ర్త్‌ డే. దీంతో స్నేహితుల‌తో క‌లిసి పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను గ్రాండ్ గా జ‌రుపుకున్నాడు.

వీడియో ఇదిగో, వేరే మహిళతో ఆ పనిలో ఉంటూ భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నల్గొండ విద్యా అధికారి, పోలీసులకు ఫిర్యాదు

బాడీలోకి తూటా..

అయితే అదే రోజు బ‌ర్త్‌ డే సెల‌బ్రేష‌న్స్ ముగిసిన త‌ర్వాత త‌న వ‌ద్ద ఉన్న తుపాకీని శుభ్రం చేసే క్ర‌మంలో అది మిస్‌ ఫైర్ అయి తూటా ఆర్య‌న్ బాడీలోకి చొచ్చుకుపోవడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడ‌ని యూఎస్ పోలీసులు తెలిపారు. ఈరోజు రాత్రికి హైదరాబాద్ కు ఆర్యన్ రెడ్డి మృతదేహం రావొచ్చని సమాచారం.

వీడియో ఇదిగో, బస్సులో కపుల్స్ సెక్స్ చేసుకుంటుండగా కండక్టర్ సడన్ ఎంట్రీ, ఛీ ఇదేమి పాడుపనంటూ తిట్టడంతో..



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif