Haryana Shocker: కదులుతున్న రైలులో వివాహితపై తెగబడిన కామాంధులు, ప్రతిఘటించడంతో రైలులో నుంచి బయటకు తోసేసిన కిరాతకులు, హర్యానాలో దారుణ ఘటన

ఆమెపై లైంగిక దాడి ప్రయత్నం చేయగా ప్రతిఘటించడంతో నడుస్తున్న రైలులో నుంచి (Woman Kicked Off Train) బయటకు తోసేశారు.

Representational Image | (Photo Credits: IANS)

Chandigarh, September 5: కదులుతున్న రైలులో కామాంధులు ఒ​ంటిరిగా ప్రయాణిస్తున్న మహిళపై తెగబడ్డారు. ఆమెపై లైంగిక దాడి ప్రయత్నం చేయగా ప్రతిఘటించడంతో నడుస్తున్న రైలులో నుంచి (Woman Kicked Off Train) బయటకు తోసేశారు. దీంతో ఆమె మృతిచెందింది. ఈ షాకింగ్‌ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహిత తన కొడుకు(9)తో కలిసి రైలులో ఫతేబాద్‌ జిల్లాలోని రోహతక్‌ నుంచి తోహానాకు వస్తోంది.ఈ క్రమంలో ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని కొందరు వ్యక్తులు గుర్తించారు. ఆమెపై కన్నేసి.. లైంగిక దాడియత్నం చేశారు. దీంతో, బాధితురాలు వారిని (Fighting Off Sex Assault Bid) ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో కామాంధులు ఆమెను.. నడుస్తున్న రైలులో (Train) నుంచి బయటకు తోసేశారు. అనంతరం, వారు కూడా రైలులో నుంచి బయటకు దూకేశారు.

కాగా, రైలు తోహానా స్టేషన్‌కు చేరుకోగానే ఏడుస్తున్న తన కొడుకును చూసి బాధితురాలి భర్త ఆందోళనకు గురయ్యాడు. తల్లి ఎక్కడ అని అడగడంతో జరిగిన విషయాన్ని అతనికి తెలిపాడు. దీంతో.. ఆమె భర్త వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. స్టేషన్‌కు 20 కి.మీ దూరంలో ఉన్నపుడు తన మొబైల్‌కి కాల్ చేసింది. స్టేషన్‌కి వచ్చి పికప్ చేసుకోవాలని తనను కోరినట్టు భర్త పోలీసులకు వివరించాడు.

ఇంత దారుణమా, కన్వత్వ పరీక్షలో ఫెయిలైన వధువు, రూ.10 లక్షల జరిమానా విధించిన పంచాయితీ పెద్దలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజస్థాన్‌ పోలీసులు

దీంతో, రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు, సివిల్‌ పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యులు.. ఆమె కోసం రైల్వే ట్రాక్‌ వెంట వెతికారు. ఈ క్రమంలో ట్రాక్‌ పక్కన పొదల్లో ఆమె డెడ్‌బాడీని గుర్తించారు. కాగా, మహిళపై లైంగిక దాడికి ప్రయత్నించిన వారిలో ఒక నిందితుడిగా సందీప్ (27)ను గుర్తించి అరెస్ట్‌ చేసినట్టు ఫతేబాద్ పోలీసు చీఫ్ అస్తా మోదీ తెలిపారు. కాగా, బాధితురాల ప్రయాణిస్తున్న సమయంలో రైలు కోచ్‌లో ముగ్గురు మాత్రమే ఉన్నారని.. ఆ సమయంలో ఇలా జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.