Bhilwara, Sep 5: రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్యత్వ పరీక్షలో వధువు విఫలం కావడంతో (failing virginity test) భర్త, అత్తామామలు ఆమెను బజారుకీడ్చారు. కన్యత్వ పరీక్షలో విఫలం అయిందంటూ పంచాయితీ నిర్వహించి ఆమెకు రూ.10 లక్షల జరిమానా (Panchayat imposes Rs 10 lakh fine) విధించారు.ఈ ఏడాది మే 11న భిల్వారా నగరానికి (Bhilwara district) చెందిన 24 ఏళ్ల యువతికి బాగోర్‌కు చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది.
అయితే ఆ సమాజం ఆచరించే ‘కుక్డి’ విధానంలో నిర్వహించిన కన్యత్వ పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో అత్తింటివారు ఆమెను నిలదీశారు. అయితే పొరుగున నివసించే ఒక వ్యక్తి పెళ్లికి ముందు తనపై అత్యాచారం చేసినట్లు వధువు చెప్పింది. దీంతో భర్త, అత్తమామలు ఆమెను కొట్టారు. అనంతరం ఆ గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అయితే లైంగిక దాడిపై మే 18న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వధువు తల్లిదండ్రులు తెలిపారు.
మరోవైపు మే 31న ఆ గ్రామంలో మరోసారి పంచాయతీ నిర్వహించారు. పరిహారం పేరుతో వధువు, ఆమె కుటుంబానికి రూ.10 లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువుతోపాటు ఆమె కుటుంబాన్ని అత్తింటి వారు వేధించారు. నూతన వధువును ఆమె పుట్టింటికి పంపారు. దీంతో, వధువు కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వధువు కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు జరిపారు. వారి చెప్పింది నిజమని తేలడంతో వధువు భర్త, మామపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి అయూబ్ ఖాన్ తెలిపారు.