Astrology: అక్టోబర్ 15 న చంద్రుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశం..మూడు రాశుల వారికి అదృష్టం.

చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు 9 గ్రహాలలో తన వేగాన్ని అత్యధికంగా మార్చుకునే ఏకైక గ్రహం చంద్రుడు మాత్రమే.

astrology

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రునికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు 9 గ్రహాలలో తన వేగాన్ని అత్యధికంగా మార్చుకునే ఏకైక గ్రహం చంద్రుడు మాత్రమే. సమయాన్నిబట్టి చంద్రుడు రాశి మార్పు కారణంగా 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయితే అక్టోబర్ 15న కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో తెలుసుకుందాం..

కన్యా రాశి- చంద్రుడు రాశి మార్పు కారణంగా ఈ రాశి వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు తమ తెలివితేటలు పెంచుకొని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తొలగిపోతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు ఎప్పటినుంచో ఉన్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. దీనివల్ల మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.

Health Tips: విటమిన్ డి తో బాధపడుతున్నారా..కారణాలు,చికిత్స తెలుసుకుందాం.

మేష రాశి- మేష రాశి వారికి చంద్రుని రాశి మార్పు కారణంగా అనుకూల ప్రభావాలు ఉంటాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీలో చదువుకునే అవకాశాలు లభిస్తుంది. వ్యాపారాలను లాభాల దిశగా అడుగులు వేస్తారు. వృత్తిపరంగా ఎదుగుదల ఉంటుంది.

ధనస్సు రాశి- ధనస్సు రాశి చంద్రుని రాశి మార్పు కారణంగా సానుకూల ప్రభావాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కోల్పోయిన డబ్బును తిరిగి పొందుతారు. ప్రేమ వివాహాలకు అనుకూలం జీవిత భాగస్వామి నుండి ప్రేమ అనురాగాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అసమానతలు తొలగిపోతాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు పని భారం తగ్గి మానసిక ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో అపారమైన లాభాలను పొందుతారు. దీని ద్వారా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.