COVID-19 in Delhi: కోవిడ్-19లో కీలక మలుపు, పండంటి బాబుకు జన్మనిచ్చిన పాజిటివ్ మహిళ, పుట్టిన బిడ్డకు నో వైరస్, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఘటన
వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. అయితే ఢిల్లీలో (Delhi) ఓ ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ 19 పాజిటివ్ ఉన్న మహిళ ( COVID-19 Positive Woman) పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు కరోనా నెగిటివ్ అని తేలింది.
New Delhi, April 4: దేశంలో రోజురోజుకీ కొత్త కరోనా కేసులు (Coronavirus Cases) నమోదు అవుతున్నాయి. వైద్యులు, సిబ్బంది కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు. 24 గంటల పాటు కరోనా బాధితుల కోసమే పనిచేస్తున్నారు. అయితే ఢిల్లీలో (Delhi) ఓ ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ 19 పాజిటివ్ ఉన్న మహిళ ( COVID-19 Positive Woman) పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఆ బాబుకు కరోనా నెగిటివ్ అని తేలింది.
తమిళనాడులో కరోనా కల్లోలం, రోబోలే నర్సులు
9నెలల కొవిడ్-19 గర్భిణికి ఎయిమ్స్ వైద్యులు (AIIMS) శుక్రవారం అతికష్టం మీద డెలివరీ చేశారు. తనకు వైరస్ సోకినప్పటికీ ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డకు వైరస్ సోకలేదు. బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు. కాగా ఢిల్లీలో కొవిడ్-19 బాధిత తల్లికి పుట్టిన మొట్టమొదటి బేబీ కూడా ఇదేనని చెప్పవచ్చు.
ఆదిత్యా బిర్లా రూ. 500 కోట్ల విరాళం
వైరస్ సోకిన బాధితురాలి భర్త ఎయిమ్స్‌లో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైకాలజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పని చేస్తున్నారు. గురువారమే వీరిద్దరూ కరోనా టెస్టింగ్ చేయించుకున్నారు. వీరిద్దిరికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. మరుసటి రోజున డాక్టర్ సోదరుడికి కూడా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అదే రోజున ఐసోలేషన్ వార్డులో 29ఏళ్ల గర్భిణి చేరింది. ఆ తర్వాత ఆమెకు పురిటి నొప్పులు రావటంతో 10 వైద్యుల బృందం కలిసి ఐసోలేషన్ వార్డును ఆపరేషన్ థియేటర్ గా మార్చేసి సి-సెక్షన్ ద్వారా డెలివరీ చేశారు.
ప్రధాని మోదీ 9 నిమిషాల మెసేజ్ రహస్యం
ప్రస్తుతానికి పుట్టిన శిశువును తల్లి పక్కనే ఉంచారు. అవసరమైనప్పుడు తల్లి పాలు ఇచ్చేందుకు అక్కడే ఉంచారు. తల్లీపాల ద్వారా బిడ్డకు వైరస్ సోకుతుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు ఇప్పటివరకూ లేవు. తల్లీకి కరోనా వైరస్ ఉండటంతో పుట్టిన బిడ్డకు కూడా వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు బ్లడ్ శాంపిల్స్ టెస్టు చేయాల్సి ఉందని ఎయిమ్స్ సీనియర్ వైద్యులు ఒకరు వెల్లడించారు.
నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగానే ఈ కేసును ఎలా డీల్ చేయాలి అనేదానిపై దేశీయ టాప్ మెడికల్ ఇన్సిస్ట్యూట్ ఓ ప్రోటోకాల్ ప్రీపేర్ చేసింది. గర్భిణి పేషెంట్ల జాగ్రత్త కోసం 38 పేజీల డాక్యుమెంట్ ను వైద్య సంస్థ సిద్ధం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. కొవిడ్-19 వ్యాధి సోకిన తల్లి తన బిడ్డకు పాలు ఇవ్వాలనకుంటే ఇవ్వొచ్చునని తెలిపింది. కానీ, కొన్ని అవసరమైన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని సూచించింది.