Mumbai, April 4: ఆదిత్య బిర్లా గ్రూపు (Aditya Birla group) కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందుకు వచ్చింది. పీఎంకేర్స్ పేరిట( PM Cares Fund) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధికి రూ.400 కోట్లను ఆదిత్య బిర్లా గ్రూపు ప్రకటించింది. అలాగే, రూ.50 కోట్లను కరోనా వైరస్ (Coronavirus) నివారణ చర్యల కోసం ఏర్పాటైన ఫిక్కీ–ఆదిత్య బిర్లా సీఎస్‌ఆర్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌కు, మరో రూ.50 కోట్లను వెంటిలేటర్లు, మాస్క్‌లు, రక్షణ పరికరాల సరఫరాకు ఖర్చు చేయనున్నట్టు గ్రూపు పేర్కొంది.
కరోనాపై పోరాటానికి అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1,125 కోట్లు
తాజాగా బాలీవుడ్ జంట దీపికా, రణ్‌వీర్ పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నట్లుగా తెలిపారు. ‘ఇలాంటి సమయంలో ప్రతి చిన్న సహాయం కూడా ఉపయోగపడుతుంది. పీఎం కేర్స్ ఫండ్‌కు తమ వంతు సాయం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాం.
కరోనా అంతు చూస్తామంటున్న కార్పోరేట్
ఇప్పుడు మనమంతా ఐకమత్యంగా ఉన్నాం. ఈ పరిస్థితి నుంచి తప్పకుండా బయటపడతాం. జైహింద్. ’ అని దీపిక రణ్‌వీర్ ట్వీట్ చేశారు. అయితే తాము ఎంత విరాళం ఇస్తున్నామనే విషయాన్ని మాత్రం ఈ హాట్ కఫుల్ బయటకు చెప్పలేదు.
రూ. 1500 కోట్లను విరాళంగా ప్రకటించిన టాటా గ్రూపు
ఇప్పటికే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రూ.25కోట్లు విరాళం ప్రకటించారు.విక్కీ కౌశల్ కోటి రూపాయలు అందించారు. హీరోయిన్ కంగనా రూ.25లక్షలు అందించారు. వీరితో పాటు కార్తిక్ ఆర్యన్, అజయ్ దేవగన్, కత్రినా కైఫ్, అలియా భట్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా కూడా విరాళాలు ప్రకటించారు.