Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేసింది ఏపీ హోం మంత్రి అనిత.
Hyd, Oct 13: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేసింది ఏపీ హోం మంత్రి అనిత.
పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు 24x7 అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని తెలిపారు హోం మంత్రి. దక్షిణకోస్తా, ఉత్తరాంధ్ర,రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు కురవనున్న నేపథ్యంలో గండ్లు పడే కాలువలు, గట్లను గుర్తించి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రధానంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ.ఇవాళ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం
రానున్న మూడు రోజులు చేపల వేటకు వెళ్ల వద్దని...విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఎక్కడైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్లు 1070, 112, 1800 - 425 - 0101 లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఇవాళ తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీయనున్నాయని, కొన్ని జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం వరకు ఉత్తర తెలంగాణలో కొన్నిచోట్ల, దక్షిణ తెలంగాణలో రెండు ఉమ్మడి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.