Himachal Pradesh Polling: హిమాచల్‌ ప్రదేశ్‌లో కొనసాగుతున్న పోలింగ్,ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంట్రీతో మారిన సమీకరణాలు, ఈ సారి కూడా అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలని చూస్తున్న బీజేపీ, 30వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు

ఎన్నికల సంఘం సుదూర ప్రాంతాల్లో మూడు సహాయక పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

polling

Shimla, NOV 12: హిమాచల్ ప్రదేశ్‌ లో (Himachal Pradesh) 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఒకే దశలో పోలింగ్ (Polling) జరుగుతుంది. ఈ ఎన్నిక బరిలో నిలిచిన 412 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 55లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు ద్వారా నిర్ణయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,884 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 397 కేంద్రాలు మంచుతో నిండి అత్యంత సంక్లిష్టంగా ఉంటాయి. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో కాజాలోని తషిగాంగ్ పోలింగ్ బూత్ దేశంలోనే అత్యంత ఎత్తలో ఉండే పోలింగ్ కేంద్రం. హిమాచల్ ప్రదేశ్ లో (Himachal Pradesh) మొత్తం 55లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,21,409 మంది ఓటర్లు 80 ఏళ్లు పైబడిన వారు. 1,136 మంది వంద సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో 24 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

2017లో 19 మంది, 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 34 మంది మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినప్పటికీ, కొండ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాల్లో తాజాగా మంచు కురుస్తుండడం ఓటర్లతో పాటు పోలింగ్ అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కిన్నౌర్ మరియు చంబాతో పాటు గిరిజన లాహౌల్ మరియు స్పితి జిల్లాలోని మొత్తం 140 పోలింగ్ కేంద్రాలు మంచుతో కప్పబడి ఉన్నాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

Rajiv Gandhi Assassination Case: రాజీవ్‌ హంతకులను విడుదల చేయాలని సుప్రీం సంచలన ఆదేశాలు, ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం 

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 7,235, పట్టణ ప్రాంతాల్లోని 646తో సహా 7,884 పోలింగ్ స్టేషన్‌లలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ (Polling) జరగనుంది. ఎన్నికల సంఘం సుదూర ప్రాంతాల్లో మూడు సహాయక పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. కొత్తగా ఆప్ ఈసారి ఎన్నికల్లో పోటీచేస్తుంది.



సంబంధిత వార్తలు