Rajiv Gandhi Assassination Case: రాజీవ్‌ హంతకులను విడుదల చేయాలని సుప్రీం సంచలన ఆదేశాలు, ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన అత్యున్నత ధర్మాసనం
Representative Image of Supreme Court ( Photo Credits: Wikimedia Commons )

New Delhi, Nov 11: దివంగత భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో (Rajiv Gandhi Assassination Case) నిందితులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళినితో పాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరణ్‌, జైకుమార్‌లను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. నళిని, ఆర్పీ రవిచంద్రన్‌లు దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

రాజీవ్‌ హత్య కేసులో నళిని మురుగన్, సంతన్, ఏజీ పెరారివళన్, జయకుమార్, రాబర్ట్ పాయస్, పీ రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. మేలో పెరారివళవన్ జైలు నుంచి విడుదలయ్యాడు.అయితే మిగిలిన ఆరుగురు దోషులు (All Six Convicts) తమిళనాడు జైళ్లలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదే తీర్పు ఆరుగురికి వర్తిస్తుందని జస్టిస్ బీఆర్ గవాయి, బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం స్పష్టం చేసింది. కేసులో నిందితులందరూ 30 సంవత్సరాలకుపైగా జైలు శిక్ష అనుభవించారు. నిందితుల ప్రవర్తన సరిగా ఉండడంతో విడుదల చేయాలని ఆదేశించింది.

ఈసీ సంచలన నిర్ణయం, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎగ్జిట్‌పోల్‌ అంచనాలపై ప్రచురణ నిషేధం, రేపటి నుంచి మొదలు కానున్న ఎన్నికల వేడి

ఇదిలా ఉంటే రాజీవ్‌ హంతకుల క్షమాభిక్షకు ఇదివరకే తమిళనాడు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2018 సెప్టెంబర్‌లో కేబినెట్‌ తీర్మానం సైతం చేసింది. అయితే.. ఆపై గవర్నర్‌కు సిఫార్సు చేయగా.. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ విషయాన్ని ఇవాళ న్యాయస్థానం ప్రస్తావించింది. ఇక ఇదే కేసులో మరో దోషి ఏజీ పేరరివాలన్‌ను విడుదల చేయాల్సిందిగా ఈ ఏడాది మే 18న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

నళినితో పాటు రవిచంద్రన్‌లు ముందస్తు విడుదల కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, బీవీ నాగరత్న నేతృత్వంలోని బెంచ్‌ .. పేరరివాలన్‌ విడుదల విషయంలో ఇచ్చిన ఆదేశాలే ఇక్కడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. క్షమాభిక్ష పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్నందునా.. వాళ్లను వెంటనే విడుదల చేయాలని సుప్రీం ఆదేశించింది.

నళినితో పాటు శ్రీహారన్‌, సంతాన్‌, మురుగన్‌, రాబర్ట్‌ పయాస్‌, రవిచంద్రన్‌, మాజీ ప్రధాని హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. 1991, మే 21వ తేదీన అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ.. తమిళనాడు శ్రీపెరుంబుదూర్‌లో తమిళ టైగర్స్‌ ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడిలో మరణించిన విషయం తెలిసిందే.రాజీవ్ గాంధీ పాదాభివందనం చేస్తున్నట్లుగా ఓ అమ్మాయి (థాను) వంగుతూ.. అదే సమయంలో వెంట తెచ్చుకున్న బాంబును పేల్చడంతో రాజీవ్‌ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.