Coronavirus Scare: జాగ్రత్తగా ఉండండి..ఒక్కడి నుంచి 406 మందికి కరోనా, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించకుంటే జరిగేది అదే, కరోనాను నిరోధించేందుకు నిబంధనలు పాటించాలని కోరిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కరోనా సోకిన వ్యక్తి సామాజిక దూరం నిబంధనను పాటించని పక్షంలో అతని వల్ల 30 రోజుల్లో 406 మంది ఈ మహమ్మారి బారిన పడతారని (one Covid-19 patient can infect 406 people in 30 days) కేంద్రం సోమవారం నాడు హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనాను నిరోధించేందుకు అత్యవసరమని మరోసారి స్పష్టం చేసింది.
New Delhi, April 27: దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటివి పాటించకపోతే (If social distancing not maintained) దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా సోకిన వ్యక్తి సామాజిక దూరం నిబంధనను పాటించని పక్షంలో అతని వల్ల 30 రోజుల్లో 406 మంది ఈ మహమ్మారి బారిన పడతారని (one Covid-19 patient can infect 406 people in 30 days) కేంద్రం సోమవారం నాడు హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనాను నిరోధించేందుకు అత్యవసరమని మరోసారి స్పష్టం చేసింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ (Lav Agrawal) పత్రికా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకూ కరోనాపై జరిగిన అధ్యయనాలన్నీ ఇదే సూచిస్తున్నాయని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటించడంతో వ్యాప్తి తీవ్రత తగ్గిపోతుందని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తే..ఒక్కో రోగి వల్ల 30 రోజుల్లో కేవలం 15 మందికే కరోనా సోకే అవకాశం ఉన్నట్టు యూనివర్శిటీల అధ్యయనంలో వెల్లడైందని పేర్కొన్నారు. కరోనా చికిత్సపై దృష్టిపెడుతూనూ వ్యాధి వ్యాప్తి నియంత్రణ మార్గాలకు ప్రాధాన్యమివ్వాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని, బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లడం గాని, వాళ్లను ఆహ్వానించడం గాని చేయొద్దని పేర్కొంది. ఆస్పత్రి బెడ్ల విషయంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావొద్దని, కరోనా సోకిన వారు డాక్టర్లు సూచించినప్పుడు మాత్రమే ఆస్పత్రిలో చేరాలని కేంద్రం పేర్కొంది. ఆరడుగుల భౌతిక దూరం పాటించినా ఒక కరోనా రోగి నుంచి మరొకరికి మహమ్మారి సోకుతుందన్నారు. మాస్కులను సరిగ్గా పెట్టుకోకపోయినా మహమ్మారి వ్యాప్తి 90 శాతం పెరిగే ముప్పుందన్నారు. మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించడం వల్ల కరోనా సోకే ముప్పు కేవలం 1.5 శాతమేనని, దానికి తోడుగా భౌతిక దూరాన్ని పాటిస్తే ఆ ముప్పు మరింత తగ్గుతుందని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్ధం చేసుకోని కరోనా నియంత్రణకు తమకు సహకరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ( Ministry of Health and Family Welfare) కోరింది. కరోనా నియంత్రణకు భౌతిక దూరమే ముఖ్యమని, మాస్కులు, శానిటైజర్లు వైరస్ వ్యాప్తి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని తెలిపింది. దయచేసి అత్యవసర విషయానికి తప్ప బయటకు వెళ్లద్దని, ఇతరులను ఇళ్లకు ఆహ్వానించద్దని సూచించింది.
మరోవైపు కరోనా విపరీతంగా వ్యాపిస్తున్న కారణంగా ఇంట్లోనూ మాస్క్‌లు పెట్టుకోవాల్సిన సమయం అసన్నమైందని కేంద్ర స్పష్టం చేసింది. వ్యాధి సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచాలని తెలిపింది. ఏ మాత్రం కరోనా లక్షణాలున్న రిపోర్ట్ వచ్చే వరకూ వేచి చూడకుండా ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవాలని సూచించింది. లక్షణాలు ఉంటే పాజిటివ్‌గానే భావించి ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌లో నెగిటివ్ వచ్చే అంతవరకూ అందరికీ దూరంగా ఉంటే మంచిదని వెల్లడించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)