'SC Cannot Sit Quietly': దేశంలో కోవిడ్ సంక్షోభం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని తెలిపిన అత్యున్నత ధర్మాసనం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
Supreme Court of India | (Photo Credits: IANS)

New Delhi, April 27: యావత్ దేశం కోవిడ్ సంక్షోభం ఎదుర్కుంటున్న వేళ ప్రేక్షకుడిగా చూస్తూ ఉండలేమని (SC on Covid crisis) భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కరోనా కల్లోలంతో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను అక్కడి హైకోర్టులు మెరుగైన స్థితిలో పర్యవేక్షణ జరుపుతున్నా ఇలాంటి సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని (annot be mute spectator to Corona crisis) తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల దేశం ఎదుర్కుంటున్న సమస్యలను సుమోటోగా స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

ఈ విచారణ సంధర్భంగా దేశంలో ఆక్సిజ‌న్ కొర‌త‌, మందులు, వ్యాక్సిన్ల అంశాలపై సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. సుప్రీంకోర్టు డీల్ చేయాల్సిన కొన్ని జాతీయ స‌మ‌స్య‌లు ఉన్నాయి. ఇలాంటి సంక్షోభం స‌మ‌యంలో కోర్టు ఓ మౌన ప్రేక్ష‌కుడిలా కూర్చోలేదు (SC cannot sit quietly) అని అత్యున్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. ఈ విష‌యంలో తాము హైకోర్టుల విచార‌ణ‌ల‌కు అడ్డుప‌డ‌టం లేద‌ని, వాటికి స‌హాయ‌క పాత్ర‌ను తాము పోషిస్తామ‌ని జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ ఎల్ఎన్ రావ్‌, జ‌స్టిస్ ర‌వీంద్ర భ‌ట్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం కోసం తాము ప్ర‌య‌త్నిస్తామ‌ని సుప్రీం తెలిపింది.

రాజకీయ పార్టీలు సంబరాలు చేసుకుంటే కఠిన చర్యలు తప్పవు, ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన ఈసీ, కోవిడ్ కల్లోలం నేపథ్యంలో కీలక నిర్ణయం

గ‌త వారం ఈ కేసును సుమోటాగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు.. కొవిడ్‌పై జాతీయ ప్ర‌ణాళిక‌ను స‌మ‌ర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు కేంద్రం త‌మ ప్ర‌ణాళిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించింది. దానిని ప‌రిశీలించిన త‌ర్వాత శుక్ర‌వారం మ‌రోసారి దీనిపై విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

మంగ‌ళ‌వారం విచార‌ణ సంద‌ర్భంగా రెండు అంశాల‌పై కేంద్రం నుంచి సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్ట‌త కోరింది. కొవిడ్ సంక్షోభ నివార‌ణ‌లో భాగంగా ఆర్మీ వంటి కేంద్ర వ‌న‌రుల‌ను వినియోగించ‌డం, వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని అడిగింది. కేంద్రానికి, రాష్ట్రాల‌కు వేర్వేరు ధ‌ర‌ల‌కు వ్యాక్సిన్లు ఇవ్వ‌డ‌మేంట‌ని ఈ సంద‌ర్భంగా నిల‌దీసింది. నేష‌న‌ల్ ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో దీనిపై కేంద్రానికే పూర్తి నియంత్ర‌ణ ఉండాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.

కరోనా వ్యాప్తికి ఈసీదే బాధ్యత, సంచలన వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు, క‌రోనా క‌ట్ట‌డికి స‌రైన ప్ర‌ణాళిక లేకుంటే మే 2న విడుద‌ల‌య్యే ఫ‌లితాల‌ను నిలిపివేస్తామ‌ని హెచ్చరిక

ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య మౌలిక సదుపాయాలకు (ఆక్సిజన్ కొరత, ఇతర సమస్యలు) సంబంధించి గురువారం సాయంత్రం 6 గంటల కల్లా రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యవహారంపై శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ‘‘హైకోర్టులు కూడా మార్గదర్శకాలు జారీ చేసేందుకు వెనుకాడవద్దు..’’ అని సుప్రీం పేర్కొంది.

తమ పరిథిలోని రాష్ట్రాల్లో కేసులను విచారించడంతో పాటు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తమ కంటే హైకోర్టులకే ఎక్కువ అవగాహన ఉంటుందని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 2256 ప్రకారం హైకోర్టులు తమ అధికారాలను వినియోగించకుండా తాము నిరోధించడం లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ రవీంద్ర భాట్ త్రి సభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.

దేశంలో కొత్తగా 2,51,827 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్, కొత్తగా 3,23,144 మందికి కరోనా నిర్ధారణ, గడచిన 24 గంట‌ల సమయంలో 2,771 మంది కరోనాతో మృతి, 1,97,894కు చేరుకున్న మరణాల సంఖ్య

కరోనా వైరస్ వ్యాక్సీన్లు, ఇతర అత్యవసర మందుల ధరలను నిర్ణయించేందుకు అన్వయించిన సూత్రం, హేతుబద్ధతను వివరించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించింది. దేని ఆధారంగా వ్యాక్సీన్ల ధరలను నిర్ణయించారో కూడా అఫిడవిట్లో వెల్లడించాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.

భారత్ బయోటెక్ తాము తయారు చేసిన కొవిడ్-19 కొవాగ్జిన్ ధరను రాష్ట్రాలకు రూ.600గానూ, ప్రయివేట్ ఆస్పత్రులకు రూ. 1200 గానూ నిర్ణయించిన విషయం తెలిసిందే. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తమ ‘కొవిషీల్డ్’ వ్యాక్సీన్ ధరను రాష్ట్రాలకు రూ.400గా నిర్ణయించగా... ప్రయివేట్ ఆస్పత్రులకు రూ.600గా నిర్ణయించింది. మరోవైపు ఈ రెండు వ్యాక్సీన్లు కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రూ.150కే లభిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.