IMD Weather Alert: భారీ వరదలు, దేశంలోని 22 రాష్ట్రాలకు మూడు రోజుల పాటు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు వాయువ్య, ఈశాన్యం నుంచి దక్షిణ భారతదేశం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది
New Delhi, July 26: దేశవ్యాప్తంగా రాగల మూడురోజుల్లో 22 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు వాయువ్య, ఈశాన్యం నుంచి దక్షిణ భారతదేశం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హర్యానాతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశలున్నాయని పేర్కొంది.
అల్ప పీడనంపై ఐఎండీ తాజా అలర్ట్ ఇదిగో, రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
భారీ వర్షాలకు గంగా, యమునా, ఘగ్గర్, హిండన్ సహా అన్ని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని నంద్ ప్రయాగ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో బద్రీనాథ్ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో యమున్రోతి రహదారి మంగళవారం సైతం మూతపడింది.
కేదార్‌నాథ్ యాత్ర సాఫీగానే కొనసాగుతున్నది. హరిద్వార్‌లో గంగా నది 293.45 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నది. ఉత్తర ప్రదేశ్ నోయిడాలో గల హిండన్ నది నీటి మట్టం పెరగడం వల్ల ఎకోటెక్ 3 సమీపంలోని ప్రాంతం మునిగిపోయింది. అక్కడ ఉన్న కార్లు అన్నీ నీటి ప్రవాహంలో మునిగిపోయాయి.