Rains

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, అలాగే తాజా వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఈ సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను అనుకుని పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోందని ఐఎండీ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని తెలిపింది.

అటు, రుతుపవన ద్రోణి పశ్చిమ కొన రాగల రెండు మూడు రోజుల్లో ఉత్తర దిశ వైపు కదిలే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మారిన వాతారణ పరిస్థితుల నేపథ్యంలో ఐఎండీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం ప్రాంతాలకు తాజా అలర్ట్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇవాళ రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.కాగా, గడచిన కొన్ని గంటల్లో ఏపీలో గురుగుబిల్లి (మన్యం జిల్లా)లో 10 సెంమీ, రణస్థలం (శ్రీకాకుళం)లో 7 సెంమీ, తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా)లో 7 సెంమీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో గరిష్ఠంగా నిజామాబాద్ జిల్లా వేల్పూరులో 40 సెంమీ వర్షపాతం నమోదైంది.

పసిఫిక్ మహాసముద్రంలో మరో తుపాన్, గంటకు 230 కిలోమీటర్ల వేగంతో గాలులు, రాగల కొన్ని గంటల్లో డోక్సురి టైఫూన్‌గా బలపడే అవకాశం

తెలంగాణలో నేటి నుంచి 28వ తేదీ వరకు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వివరించింది. రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. రానున్న 24గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కరీంనగర్‌, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, వికారాబాద్‌లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

భారీ వర్షాల దెబ్బకి కార్లు ఎలా మునిగిపోయాయో చూడండి, యూపీలో ఎకోటెక్ 3 సమీపంలో నీట మునిగిన వాహనాలు

ఈమేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మంచిర్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసిన వాతావరణశాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

బుధవారం నుంచి గురువారం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, భువనగిరిలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.

గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిజామాబాద్‌, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది.

మిగతా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణశాఖ. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు నిజామాబాద్‌, వరంగల్‌, జనగాం, హన్మకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాపాతం నమోదైంది.