Coronavirus Outbreak: మాస్క్ అవసరం లేదు, ఎప్పుడు పెట్టుకోవాలో మేము చెబుతాం, విచిత్ర వ్యాఖ్యలు చేసిన అస్సాం బీజేపీ మంత్రి హిమంత్ బిశ్వా సరమ్, దేశంలో తాజాగా 93,249 మందికి కరోనా, మహారాష్ట్రలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు

అసోం ప్రజలు కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ లేదన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ హిమంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Assam Minister Himanta Biswa Sarma (Photo Credits: IANS)

New Delhi, April 4: దేశంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 93,249 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 513 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,24,85,509కు (India Coronavirus) చేరినట్లు ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ప్రస్తుతం 6,91,597 యాక్టివ్ కేసులుండగా... కరోనా నుండి ఇప్పటి వరకు 1,16,29,289 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 వైరస్సోకి ఇప్పటి వరకు 1,64,623 మంది మృతి చెందగా.. నిన్న ఒక్కరోజే 60,048 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.14 శాతం కాగా.. మరణాల రేటు 1.32 శాతంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

కాగా సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒక రోజులో 98 వేల కొత్త కరోనా కేసులు (COVID-19 Cases in India) వచ్చిన తరువాత, తిరిగి ఐదు మాసాల తరువాత ఆ స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి. నిన్న శనివారం నాడు ఏకంగా 93,077 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో నాలుగు నెలల తరువాత మరణాల సంఖ్య 500ను తాకింది. మరో వారం, పది రోజుల వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డును దాటేస్తుందని, అన్ని రాష్ట్రాలూ జాగ్రాత్తగా ఉండి, కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

ఢిల్లీలో మూడు దాటి 4వ దశలోకి చేరిన కరోనా, మీకు దండం పెడతాను.. దయచేసి మాస్క్‌ ధరించండని వేడుకుంటున్న సీఎం కేజ్రీవాల్, లాక్‌డౌన్‌ లేదు, జాగ్రత్తలు పాటించాలని సీఎం సూచన

అసోం ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత హిమంత్ బిశ్వా సరమ్ విచిత్ర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. అసోం ప్రజలు కరోనా వైరస్ నుంచి కాపాడుకునేందుకు మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ లేదన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ హిమంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒక ఇంటర్వ్యూలో హిమంత్ బిశ్వా మాట్లాడుతూ జనం మాస్క్ పెట్టుకుని భయాలను పెంచుతున్నారని, అయితే అసోంలో మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలోని ప్రజలు మాస్క్ లు ఎప్పుడు పెట్టుకోవాలో తాము తెలియజేస్తామన్నారు. తాము ఎకానమీని రివైవ్ చేయాల్సివున్నదన్నారు. మాస్క్ పెట్టుకుంటే బ్యూటీ పార్లర్‌కు ఎలా వెళ్లగలమని ప్రశ్నించారు. ఎవరికైనా కోవిడ్ వచ్చిందని అనిపిస్తే ఆరోజు వారు మాస్క్ పెట్టుకోవాలని అన్నారు.

దేశాన్ని వణికిస్తున్న సెకండ్ వేవ్, రోజువారీ కేసుల్లో అమెరికా, బ్రెజిల్‌ను దాటేసిన ఇండియా, పేదలను భయపెడుతున్న లాక్‌డౌన్ ఊహగానాలు, సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్న వలస కార్మికులు

మహారాష్ట్రలో తాజాగా 49,447 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇప్పటి వరకు నమోదైన సంఖ్య కంటే అత్యధికంగా ఉంది. మరోవైపు 277 మంది మృతి చెందారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసులు నాలుగు లక్షలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,01,172 యాక్టివ్‌ కేసులున్నాయి. దీంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే శనివారం కరోనా నుంచి 37,821 మందికి నయమవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.

రాష్టంలో అత్యం వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి సునామీలా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. గత వారం రోజుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా కరోనా సోకింది.

ఆరోగ్య శాఖ అందించిన వివరాల మేరకు గత శనివారం మార్చి 27 నుంచి 3,15,712 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలో శనివారం కరోనా కేసులు 9,108 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 27 మంది మృతి చెందారు. అదే విధంగా గత వార ం రోజుల్లో కరోనా రోగుల సంఖ్య 55,684 నమోదు కావడం అత్యంత ఆందోళన కరమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు పుణేలో మినీ లాక్‌డౌన్‌ ప్రకటించారు. శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ శనివారం పుణే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 5,778 కరోనా కేసులు నమోదు కాగా 37 మంది మృతి చెందారు.