India Covid Updates: ఎయిమ్స్‌లో 53 మంది డాక్టర్లకు కరోనా, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కోవిడ్ పాజిటివ్, కరోనా హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం..నలుగురు మృతి, దేశంలో కొత్తగా 1,45,384 పాజిటివ్‌ కేసులు నమోదు

మరో వైపు మహమ్మారి బారినపడి 794 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,32,05,0926కు (India Covid Updates) చేరాయి.

coronavirus in idnia (Photo-PTI)

New Delhi, April 10: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,45,384 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. మరో వైపు మహమ్మారి బారినపడి 794 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,32,05,0926కు (India Covid Updates) చేరాయి.

ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి 1,68,436 మంది ప్రాణాలు విడిచారు. తాజాగా 77,567 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం 1,19,90,859 మంది కోలుకున్నారు. రెండో దశ (Covid Second wave) వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో యాక్టివ్‌ కేసులు 10లక్షల మార్క్‌ను దాటాయి.

ప్రస్తుతం దేశంలో 10,46,631 క్రియాశీల కేసులున్నాయని ( COVID19 Pandemic India) ఆరోగ్యశాఖ తెలిపింది. మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 9,80,75,160 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. దేశంలో రెండో దశలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి.

వారాంతపు లాక్‌డౌన్‌తో పాటు నైట్‌కర్ఫ్యూ అమలులోకి తీసుకువచ్చినా రోజువారీ కేసులు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు దేశవ్యాప్తంగా 11,73,219 కొవిడ్‌ శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 25.52 కోట్ల టెస్టులు చేసినట్లు ఐసీఎంఆర్‌ చెప్పింది.

మాస్కులు ధరించాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది. మాస్క్ ధరించండి, ప్రాణాలు కాపాడండి, కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ గూగుల్ డూడుల్, దేశంలో శరవేగంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు

మధ్యప్రదేశ్ లోని ప్రతిష్ఠాత్మక వైద్యశాలగా పేరున్న ఎయిమ్స్ (AIIMS) ఇప్పుడు కరోనా మహమ్మారికి నిలయంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా, తాజాగా ఎయిమ్స్ లోని 53 మంది డాక్టర్లు, విద్యార్థులు మహమ్మారి బారిన పడటం తీవ్ర కలకలం రేపింది. వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కూడా వైరస్ బారిన పడిన వారి జాబితాలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మనుషుల నుంచి జంతువులకు కరోనా, పెంపుడు జంతువుల‌కు దూరంగా ఉండ‌టం మంచిదని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో, ఇత‌ర జంతువుల‌పై వైర‌స్ ప్ర‌భావం గురించి అధ్యయనం

భోపాల్ ఎయిమ్స్ కు నిత్యమూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. గత కొంతకాలంగా కరోనా సోకిన వైద్యులు, హెల్త్ కేర్ వర్కర్లు ఎవరిని కాంటాక్ట్ చేశారన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదిలావుండగా, ఇటీవల ఎయిమ్స్ లో వంద మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడ్డారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు రాగా, వాటిని ఉన్నతాధికారులు ఖండించారు.

రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కరోనా పాజిటివ్‌గా పరీక్ష చేశారు. ఈ మేరకు ఆర్‌ఎస్‌ఎస్‌ ట్వీట్‌ చేసింది. సాధారణ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలినట్లు పేర్కింది. దీంతో ఆయన నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరారు. ఆయనకు సాధారణ పరీక్షలు చేశారని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ భగవత్‌ మార్చి 7న కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్‌ తీసుకున్నారు.

Here's RSS Tweet

మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో 58,993 కరోనా కేసులు రికార్డవగా.. 301 మరణాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ముంబైలో 9,200 కేసులు, 35 మరణాలు రికార్డయ్యాయి. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని కొవిడ్‌ హాస్పిటల్‌లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగి నలుగురు మృత్యువాతపడ్డారు. అదే సమయంలో హాస్పిటల్‌లో ఉన్న 27 మంది రోగులను మరో ఆస్పత్రికు తరలించినట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నాగ్‌పూర్‌ వాడి పరిసరాల్లోని ప్రైవేటు ఆసుపత్రిలో 30 పడకలు ఉండగా.. 15 ఐసీయూ పడకలు ఉన్నాయి.

A fire broke out at a COVID hospital in Nagpur

ఆస్పత్రి రెండో అంతస్థులో ఐసీయూ ఏసీ యూనిట్‌ నుంచి మంటలు మొదలయ్యాయి. తర్వాత వార్డు మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే మంటలు రెండో అంతస్తుకే పరిమితమయ్యాయి. మిగతా అంతస్తులకు వ్యాపించకపోవడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజేంద్ర ఉచ్కే పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పినట్లు చెప్పారు.

ఆస్పత్రిలో కొవిడ్‌ రోజులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌ కలెక్టర్‌తో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

ఈ లక్షణాలు ఉంటే మీకు కొత్త రకం కరోనా వచ్చినట్లే, సెకండ్ వేవ్‌లో పెరుగుతున్న రోగుల సంఖ్య, శరీరంలోని కీలకమైన అవయవాలపై దాడి చేస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్

కరోనా కేసుల పెరుగుదలతో ఉత్తరప్రదేశ్‌లోని మరోనగరంలో అధికారులు రాత్రి కర్ఫ్యూ అమలులోకి తీసుకువచ్చారు. ముజఫర్‌నగర్‌లో నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని జిల్లా మేజిస్ట్రేట్ సెల్వా కుమారి తెలిపారు.

రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల కదలికలపై నిషేధాజ్ఞలుంటాయని, అవసరమైన సేవలకు సంబంధించి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ముజఫర్‌నగర్‌లో శుక్రవారం 134 మంది వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించగా.. మొత్తం 9,522 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. 115 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే 8న వారణాసి, కాన్పూర్‌, లక్నో, ప్రయాగ్‌రాజ్‌లో అమలులో ఉంది. పెరుగుతున్న కరోనా కేసులతో అధికారులు వైరస్‌ కట్టడికి చర్యలు చేపడుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ వ్యాప్తి ఆందోళన రేపుతున్నది. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. తదుపరి ఆదేశాల వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలను బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో గురువారం రికార్డు స్థాయిలో 7,500కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Here's Delhi CM Tweet

గత రెండు రోజులుగా ఐదు వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి. కరోనా కేసుల మొత్తం సంఖ్య ఏడు లక్షలకు చేరింది. ఎయిమ్స్‌, గంగా రామ్ ఆసుపత్రుల్లోని వైద్యులు కరోనా బారినపడుతున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో ఢిల్లీలో ఈ నెల 6 నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ నెల 30 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనున్నది.



సంబంధిత వార్తలు