Coronavirus in India: రాబోయే 3 నెలలు కరోనా నుంచి తట్టుకుంటే చాలు, రోజుకు 5 లక్షల కేసులు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధమని తెలిపిన కేంద్రం, దేశంలో తాజాగా 19,740 మందికి కోవిడ్
దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కి చేరింది. ఇందులో 2,36,643 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,50,375 మంది మృతిచెందారు. 3,32,4,291 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 248 మంది కరోనాకు బలవగా, 23,070 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని ( 23,070 Recoveries in Past 24 Hours) కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
New Delhi, October 9: దేశంలో కొత్తగా 19,740 కరోనా కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,39,35,309కి చేరింది. ఇందులో 2,36,643 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 4,50,375 మంది మృతిచెందారు. 3,32,4,291 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 248 మంది కరోనాకు బలవగా, 23,070 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని ( 23,070 Recoveries in Past 24 Hours) కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
గతకొంతకాలంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో కేరళలోనే అత్యధికంగా ఉంటున్నాయి. అయితే రెండు వారాలుగా ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. దీంతో దేశంలో కూడా కరోనా కేసులు తుగ్గుతున్నాయి. కేరళలో శుక్రవారం 10,944 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు మాత్రమే ఉన్నాయి.
కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్దంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 5 లక్షల కోవిడ్ కేసులు నమోదైనా వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. అయితే మున్ముందు కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. కోవిడ్ -19 రోగుల కోసం 8.36 లక్షల హాస్పిటల్ పడకలు అందుబాటులో ఉన్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ తెలిపారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు మిలియన్ (9,69,885) అదనపు ఐసోలేషన్ పడకలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. వీటితో పాటు 4.86 లక్షల ఆక్సిజన్ పడకలు, 1.35 లక్షల ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దేశంలో దాదాపు 1,200 ప్రెజర్ స్వింగ్ అడ్‌జార్షన్ (పీఎస్‌ఏ) ఆక్సిజన్ ప్లాంట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
మున్ముందు ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం మరో 4 వేల పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వీకే పాల్ చెప్పారు. దేశంలో ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్ కొరత లేదని, ప్రజలు రెండో డోస్ టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ‘ఒకవేళ మళ్లీ కరోనా కేసులు పెరిగినా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రోజుకు నాలుగున్నర నుంచి 5 లక్షల కోవిడ్ కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు సన్నాహాలు చేస్తున్నామ’ని అన్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారిపై పోరాటంలో రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ మూడు నెలలు కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు.