Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, Oct 8: దేశంలో తాజాగా 13,85,706 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 21,257 మందికి (India logs 21,257 new Covid cases) పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. 271 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.39 కోట్లకు (Coronavirus in India) చేరగా.. 4,50,127 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 2,40,221 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.71 శాతానికి తగ్గింది. రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. నిన్న 24,963 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.32 కోట్ల(97.96 శాతం) మార్కును దాటాయి. ఇక నిన్న 50.17 లక్షల మంది టీకా వేయించుకున్నారు. దాంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 93 కోట్లకు చేరింది.

కేరళ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.కేరళలో గడచిన 24 గంటల్లో 99,312 మందికి కరోనా పరీక్షలు చేయగా, వారిలో 12,288మందికి పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా సోకిన వారిలో 10,271 మంది రెండు డోసుల టీకాలు వేయించుకున్నారని వైద్యాధికారుల పరిశీలనలో వెల్లడైంది. 3,270 మంది సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని వారికి తాజాగా కరోనా సోకిందని వైద్యాధికారులు చెప్పారు. కేరళలో ప్రస్థుతం 1,18,744 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రోగుల్లో 10.7 శాతం మంది ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరారని వెల్లడైంది. మొత్తంమీద కేరళ రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 50 లక్షల మందికి చేరువలో ఉంది.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్, జర్నీలో మాస్క్ లేకుంటే రూ. 500 జరిమానా, స్టేషన్లో మాస్క్ లేకుండా కనపడినా ఫైన్, ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే మంత్రిత్వశాఖ

కేరళలో ఇప్పటివరకు మొత్తం 47,76,311 మందికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. కరోనా వైరస్ సోకడం వల్ల కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు 25,952 మంది మరణించారని వైద్యఆరోగ్యశాఖ రికార్డులే చెబుతున్నాయి. కేరళలో 3,77128 మంది కరోనా అనుమానంతో పరిశీలనలో ఉన్నారు. అందులో 3,62,444మంది హోం క్వారంటైన్ లో , 14,684 మంది ఆసుపత్రుల్లో ఐసోలేషన్ లో ఉన్నారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.కేరళ జనాభాలో 93.16 శాతం మంది సింగిల్ డోస్ కొవిడ్ టీకా తీసుకున్నారు. మొత్తం జనాభాలో 43.14 శాతం అంటే 1,15,23,278 మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని వైద్యాధికారులు చెప్పారు.