India Coronavirus: పెళ్లయిన 2 రోజులకే వరుడిని కరోనా కాటేసింది, బీహార్‌లో పెళ్లికి వచ్చిన వారిలో 95 మందికి కోవిడ్-19, దేశంలో తాజాగా 18,522 పాజిటివ్ కేసులు నమోదు
గత 24 గంటల్లో దేశంలో 18522 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒక్క రోజులోనే దేశంలో 418 మంది వైరస్ ( Coronavirus Deaths) బారినపడి మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 5,668,40గా ఉన్నది. దీంట్లో 2,15,125 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3,34,822 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 16,893గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది.
New Delhi, June 30: ఇండియాలో ఇవాళ అత్యధికంగా కరోనా వైరస్ (Coronavirus) కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 18522 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒక్క రోజులోనే దేశంలో 418 మంది వైరస్ ( Coronavirus Deaths) బారినపడి మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 5,668,40గా ఉన్నది. దీంట్లో 2,15,125 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 3,34,822 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 16,893గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొన్నది. మహారాష్ట్రలో 1,030మంది పోలీసులకు కరోనా, కోవిడ్-19 కల్లోలానికి అక్కడ 59మంది పోలీసులు మృతి, ముంబైలో అత్యధిక కేసులు నమోదు
పెళ్లి అయిన రెండు రోజులకే వరుడు కరోనావైరస్‌తో (COVID-19) మరణించిన విషాద ఘటన బీహార్ రాష్ట్రంలోని పాలిగంజ్ పట్టణ సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని దీహపాలికి గ్రామానికి చెందిన 30 ఏళ్ల వరుడు గురుగ్రామ్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు. యువకుడు పెళ్లి చేసుకునేందుకు మే 12వతేదీన తన స్వగ్రామమైన దీహపాలికి వచ్చాడు. ఈ కాలంలో యువకుడికి కరోనా సోకింది. అయినా అతను పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో జూన్ 15 వతేదీన ఓ యువతిని వివాహమాడారు. జూలై 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కారు, ముంబైని వణికిస్తున్న కరోనావైరస్
వివాహం చేసుకున్న రెండు రోజులకే వరుడి ఆరోగ్య క్షీణించడంతో అతన్ని పట్నాలోని ఎయిమ్స్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. వివాహానికి 50 మంది అతిథులను మాత్రమే అనుమతించాలని, వేడుకలో సామాజిక దూరం పాటించాలనే నియమాలను ఉల్లంఘించడంతో..పెళ్లికి వచ్చిన అతిథులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్ (Super-spreader wedding) అని తేలింది. కాగా వధువుకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఈ పెళ్లి వల్లనే అత్యధికంగా 95 మందికి కరోనా వ్యాపించిందని తేలడంతో జిల్లా అధికారులు అప్రమత్తమై వారందరినీ క్వారంటైన్ కు తరలించారు.