IPL Auction 2025 Live

Coronavirus in India: దేశంలో కొత్తగా 42,766 మందికి కరోనా, కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే, నైట్ కర్ఫ్యూతో పాటు, ఆదివారం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విజయన్ సర్కారు

దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

New Delhi, Sep 5: దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కాగా, కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే (Kerala) ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 29,682 కేసులు నమోదవగా, 142 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు 66.89 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 4.37 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంచామని తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదకరంగా మారిన ఏవై.12 రకం కరోనా, ఏపీలో 18, తెలంగాణలో 15 కేసులు నమోదు, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 178 కేసులు వెలుగులోకి

కేరళలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ, ఆదివారం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం కేరళ సీఎం పినరయ్ విజయన్‌ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ, ఆదివారం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.

మళ్లీ కేరళలో నిఫా వైరస్, 12 ఏండ్ల బాలుడు మృతి, బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిలో అధికారులు, కోజికోడ్‌కు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ బృందం

అయితే కేరళలో రికార్డు స్థాయిలో శనివారం 29,682 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్వాప్తంగా కేరళలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. క‌రోనా క్వారంటైన్‌, ఐసోలేష‌న్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని కేరళ ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.