Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

Kozhikode, Sep 5: కేరళలో కరోనా థర్డ్ వేవ్ కల్లోలం రేపుతుంటే ఇప్పుడు దానికి నిఫా వైరస్ (Nipah Virus) తోడయింది. కోజికోడ్‌లో (Kozhikode) ఈ వైరస్‌ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్‌ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్‌కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. కోజికోడ్‌లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృంధాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిని ప్రారంభించామని తెలిపారు.

కాగా, 12 ఏండ్ల బాలుడు నిఫా లక్షణాలతో ఈనెల 3న కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. అతని నుంచి సేకరించిన నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. అందులో నిఫా వైరస్‌ ఉన్నట్లు ఫలితాల్లో తేలిందని అధికారులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కూడా వైరస్‌ వల్లే అతడు మరణించాడని ధృవీకరించింది. ఈ నేపథ్యంలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (NCDC) బృందాన్ని (National Centre for Disease Control) ప్రభుత్వం కోజికోడ్‌ పంపించింది.

కరోనా కన్నా ప్రమాదకర వైరస్, మహారాష్ట్రలో మహాబలేశ్వర్ గుహలో గబ్బిలాల్లో నిఫా వైరస్, మనుషులకు సోకితే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం వైద్య నిపుణుల హెచ్చరిక, నిఫా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి

దక్షిణ భారత దేశంలోని కేరళలోని కోజికోడ్‌లో 2018 మే 19న తొలిసారిగా నిఫా వైరస్ కనిపించింది. జూన్ 2018 నాటికి ఈ వైరస్ కారణంగా 17 మంది మృతి చెందారు. అప్పట్లో మొత్తం 18 నిఫా వైరస్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రప్రభుత్వం ఇంకా అధికారికంగా నిఫా వైరస్ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించలేదు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఈరోజు ఉదయం కోజికోడ్ ఆసుపత్రిని సందర్శించనున్నారు.